మద్యం దుకాణం మాకొద్దు ధర్నా చేస్తున్న స్థానిక మహిళలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు సింహపురి హాస్పిటల్ జంక్షన్ లో ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళల బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నెల్లూరు నగరంలో ఇష్టారాజ్యాంగా అధికార పార్టీ నేతల మద్యం దుకాణాలు పెడుతున్నారని తెలిపారు. అధికారపార్టీ అండతో
పెట్రేగిపోతున్న బడా సిండికేట్లు ఇష్టం వచ్చిన రీతిలో షాపులను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
నెల్లూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే మహిళలు ఉద్యమిస్తున్నారని తెలిపారు.
నెల్లూరు నగరంలో మద్యం దుకాణాలను బడా సిండికేట్లు శాసిస్తున్నాయని ఆరోపించారు. సిండికేట్ లు నడిపే వ్యక్తులు అధికార పార్టీ నేతలే కావడంతో వారి మాట వేదంగా మారిందని చెప్పారు.మద్యం వ్యాపారం జోలికి వెళ్ళవద్దని పదేపదే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న నెల్లూరులో మాత్రం ఈ మాటలను పెద్దచెవిన పెడుతున్నారని ఆరోపించారు.
మాదే అధికారం అంటూ మద్యం వ్యాపారం దగ్గర్నుంచి ఇసుక వ్యాపారం వరకు ఏది చేసినా అధికార పార్టీ నేతలదేనని చెప్పారు.అధికార పార్టీ నేతలే ఉండడంతో అధికారులు కూడా చూసి ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
Post a Comment