వసతి గృహ విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టండి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ పద్మావతి
నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్)
జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ బి.పద్మావతి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సంక్షేమ శాఖల అధికారులతో వసతి గృహాల సంక్షేమ అధికారులు, వార్డెన్లతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో పిల్లల సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. బాలల సంరక్షణ చట్టాలను క్షేత్రస్థాయిలో అమలుచేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు. రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలు అనేక హింసలకు, మానసిక వేధింపులకు గురవుతున్నారన్నారు రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో అధికారులు పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో చూడాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో ఉండే పిల్లలకు పాఠశాలల్లో పాఠ్యాంశాలతో పాటు బాలల చట్టాలపై కూడా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో తప్పనిసరిగా ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలని అని చెప్పారు. సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలకవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రమీల, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ప్రసన్న, సంక్షేమ వసతి గృహాల అధికారులు హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment