శ్రీ విజేత స్కూల్ లో ఘనంగా దీపావళి వేడుకలు.
పొదలకూరు మేజర్ న్యూస్
పట్టణంలోని శ్రీ విజేత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో "ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా *పాఠశాల కరస్పాండెంట్ జి .కామాక్షి మాట్లాడుతూ భారతదేశం ముఖ్యంగా ఆచారాలు ,సంస్కృతులు ,పద్ధతులు కలగలిసిన దేశమని,హిందువులు జరుపుకునే పండుగలలో దీపావళి ఎంతో ప్రత్యేకమైన పండుగగా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారని ఆమె తెలిపారు. దీపావళి అంటే ఉత్సవాలు ,దీపావళి అలంకరణ ,టపాకాయల కొనుగోళ్లు, పూజలు ,ప్రార్థనలు భారతీయ సంస్కృతి ఉట్టి పడే విధంగా అందరూ కలసి దీపాలతో తమ ఇళ్లకు అలంకరించి ఒక కొత్త కాంతిని వెదజల్లుతారని ఉపాద్యాయులు ముందస్తు దీపావళి సందర్భంగా విద్యార్థులకు హితబోధ చేసారు. శ్రీ లక్ష్మీ దేవి వైభవ అలంకరణతో శ్రీ లక్ష్మీ అమ్మవారికి అంగరంగ వైభవంగా శ్రీ విజేత స్కూల్ నందు యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు మరియు పిల్లలతో పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.దీపావళి సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి పిల్లలతో టపాసులు పేలూస్తూ,చిచ్చుబుడ్లు ను వెలిగించి కాకరొత్తులతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది.
Post a Comment