ఈవ్ టీచింగ్,సైబర్ క్రైమ్ పై ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అవగాహన

 ఈవ్ టీచింగ్,సైబర్ క్రైమ్ పై ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అవగాహన




పొదలకూరు మేజర్ న్యూస్..

పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శుక్రవారం ఎన్. ఎస్ .ఎస్ అధ్వర్యంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈవ్ టీచింగ్- ర్యాగింగ్, సైబర్ క్రైమ్ పైనా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పొదలకూరు ఎస్. ఐ హనీఫ్ ,ప్రిన్సిపాల్ కె.లక్ష్మీ నారాయణ  అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ హనీఫ్  విద్యార్థుల కు  సైబర్ క్రైమ్ పైనా , ఈవ్ టీచింగ్-ర్యాగింగ్ పై అవగాహన కల్పించారు.ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ అనేవి నేరమని, ఎవరైనా తోటి విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలుంటాయని భవిష్యత్తు కోల్పోతారని తెలిపారు.సమస్యలు ఎదురైనప్పుడు యువత ధైర్యంతో ఎదుర్కొవాలే తప్ప ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదన్నారు.మాదకద్రవ్యాల బారినపడి విద్యార్ధులు జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్దులకు వెల్లడించారు.మాదక ద్రవ్యాల నివారణలో భాగంగా ఎవరైనా క్రయ, విక్రయాలు జరిపినా లేదా సేవించినా కాల్ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.సోషల్ మీడియా వేధింపుల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనవసర లింకులు షేర్ చేయకూడదని, తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లోన్ యాప్ లు, ఇన్వెస్ట్మెంట్లు, apk ఫైల్స్, బెట్టింగ్ యాప్స్ లాంటి వాటితో మోసపోకూడదని విద్యార్ధులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.ఎన్ ఎస్ ఎస్ పి.ఓ నాహిద్,  జనార్థన్, పచ్చిపాల.పెంచలయ్య,రాము,ఇతర అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది  పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget