9 వ ఆల్ ఇండియా పోలీస్ జుడో క్లస్టర్ గేమ్స్-2024

 9 వ ఆల్ ఇండియా పోలీస్ జుడో క్లస్టర్ గేమ్స్-2024 లో మొదటి బహుమతి పొందిన చరణ్ తేజ, రెండవ బహుమతి పొందిన రాజశేఖర్ మరియు మూడవ బహుమతి పొందిన శ్రావణి లను అభినందించిన జిల్లా యస్.పి. శ్రీ కృష్ణకాంత్,IPS., గారు






గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన చరణ్ తేజ, రాజశేఖర్, శ్రావణి లను జిల్లా పోలీసు కార్యాలయం నందు అభినంధించిన జిల్లా యస్.పి. గారు.

జూన్ 24 నుండి 30 వరకు అస్సాం పోలీస్ అధ్వర్యంలో అస్సాంలోని గౌహతిలో 9 వ ఆల్ ఇండియా పోలీస్ జుడో క్లస్టర్ గేమ్స్-2024 ను దేశవ్యాప్తంగా పోలీసులకు నిర్వహించగా జూడో క్లస్టర్ ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ లో గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ పతకాలు సాధించి నెల్లూరు పోలీసుల సత్తా చాటిన చరణ్ తేజ, రాజశేఖర్ మరియు శ్రావణి లు.

ARHC-1727 శ్రీ కె.మురళిధర్ గారి కుమారుడు ARPC-2083, కె.చరణ్ తేజ, స్పెషల్ పార్టీ, నెల్లూరు. పెన్ కాక్ సిలాట్ విభాగం నందు మొదటి స్థానం సాధించగా వారికి గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ మరియు మూడు లక్షలు రూపాయలు నగదు, మూడు ఇంక్రిమెంట్స్ అందజేత.

రైతు శ్రీ మస్తాన్ రెడ్డి గారి కుమారుడు HC-819, యం. రాజశేఖర్, కందుకూరు రూరల్ స్టేషన్. పెన్ కాక్ సిలాట్ విభాగం నందు రెండవ స్థానం సాధించగా వారికి సిల్వర్ మెడల్, సర్టిఫికెట్ మరియు రెండు లక్షలు రూపాయలు నగదు, రెండు ఇంక్రిమెంట్స్ అందజేత.

కావలిలో VRA శ్రీ తిరుపతి గారి కుమార్తె AR WPC-564, A. శ్రావణి, స్పెషల్ పార్టీ, నెల్లూరు. కరాటే నందు తృతీయ బహుమతి సాధించగా ఆమెకు బ్రాంజ్ మెడల్, సర్టిఫికెట్ మరియు లక్ష రూపాయలు నగదు, ఒక ఇంక్రిమెంట్ అందజేత.

బాగా తర్పీదు పొందాలని, తదుపరి నిర్వహించే క్రీడలలో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. 

క్రీడాకారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 పతకాలు రాగా అందులో నెల్లూరు పోలీసులకు మూడు..

జిల్లా నుండి ముగ్గురు క్రీడాకారులు పాల్గొనగా అందరికీ బహుమతులు రావడం విశేషం..

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget