ప్రిబ్రవరి 28 వరకు పశుగణన జరుగుతుంది
కలువాయి మేజర్ న్యూస్ కలువాయి,చేజర్ల మండలాల్లో నేటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు పశుగణన జరుగుతుందని పశు సంవర్ధక శాఖ ఏడి అన్నపూర్ణ తెలిపారు. పశుసంవర్ధక శాఖ రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు.పశు గణన సిబ్బంది కలువాయి, చేజర్ల మండలాల్లో ప్రతి గడపకు వచ్చి విషయసేకరణ గావిస్తారనీ,మీ ఇంటికి వచ్చే విషయ సేకరణ దారులకు పశువుల సమగ్ర సమాచారం అందించాలని కోరారు.పశుగణన భారతదేశం అంతటా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నారు. సాధారణంగా అన్ని సాధుజంతువులు,పెంపుడు జంతువుల వివరాలు గణన చేస్తారన్నారు.మీ ఇంటికి వచ్చే విషయసేకరణదారునికి మీ పశువుల, పెంపుడు జంతువుల సమగ్ర సమాచారం అందించి తద్వారా పశు సంవర్ధకశాఖ పధకాల రూపకల్పనకు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు గంగాధరం, రాజేష్, కలువాయి, చేజెర్ల మండలలా సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment