విజయవాడలో నెల్లూరు పారిశుధ్య కార్మికుల సేవలు..!
నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్.పొంగూరూ నారాయణల ఆదేశాల మేరకు నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ నేతృత్వంలో విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టేందుకు సుమారు166 మంది పారిశుధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు 4,సచివాలయం శానిటేషన్ కార్యదర్శులు 5, మేస్త్రీ లు 10 తో బుధవారం 5 బస్సులలో వరద ముంపు ప్రాంతమైన విజయవాడకు పయనమయ్యారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణం నుంచి బస్సులను అదనపు కమిషనర్ శర్మద, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్యలు ప్రారంభించారు. విజయవాడలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ నేతృత్వంలో గత రెండు రోజులుగా పారిశుధ్య నిర్వహణ పనులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ విభాగం నుంచి ఈ.ఈ చంద్రయ్య, డి.ఈ లు సురేష్, అనిల్ కుమార్ విజయవాడ విధుల్లో పాల్గొంటున్నారు. పై కార్యక్రమంలో శానిటేషన్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment