అనుమతులు లేకుండానే పూడికతీత పనులు.

 అనుమతులు లేకుండానే పూడికతీత పనులు.




- చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం.

- భారీ అవినీతికి సిద్ధమైన కూటమి నాయకులు.


విడవలూరు మేజర్ న్యూస్.


విడవలూరు మండలంలోని ఊటుకూరు గ్రామం నుంచి సముద్రంలోకి వెళ్లే డ్రైన్ కాలువకు ఎలాంటి అనుమతులు లేకుండానే కూటమి నాయకులు ఇష్టానుసారంగా పూడిక తీత పనులు చేపడుతున్నారు.  స్థానికంగా ఉన్న కూటమి నాయకులు అనుమతులు తీసుకోకుండానే దాదాపు నాలుగు భారీ యంత్రాల సహాయంతో పూడిక తీత పనులను చేపట్టారు. సంబంధిత శాఖ అధికారుల అనుమతులు లేకుండానే వారికి సమాచారం ఇవ్వకుండానే కూటమి నాయకులు ఇష్టానుసారంగా పూడిక తీత పనులు చేపట్టడంతో కాలువ ఆయకట్టుకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పూడిక తీత పనులు చేపట్టి రానున్న కాలంలో భారీ ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని జేబులు నింపుకునేందుకు కూటమి నాయకులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అవినీతి రహిత కోవూరుగా తీర్చిదిద్దాలనుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కూటమి నాయకులే అడ్డుపడుతున్నారు. ఈ పూడిక తీత పనుల వల్ల భారీ అవినీతి పాల్పడేందుకు కూటమి నాయకులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే సంబంధిత అధికారులకు తెలియకుండానే భారీ ఎంత సహాయంతో పూడికతీత పనులు చేపట్టారు. పనులు పూర్తయిన తర్వాత భారీ ప్రతిపాదనలు  పంపించేందుకు తద్వారా అవినీతికి పాల్పడేందుకు కూటమినేతల సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పుడికి తీత పనుల వల్ల డ్రైన్ కాలువకు సమీపంలో ఉన్న చిన్న కార్ రైతులు తమ పొలాలు దెబ్బతింటాయి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డ్రైన్ శాఖ డి ఈ  ఖాన్ ను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని దాంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. ప్రస్తుతం తమకు తెలియకుండానే పనులు చేయటం జరుగుతుందని ఈ విషయం పనులు చేస్తున్న నిర్వాహకులు పిలిచి ఆర తీశామన్నారు. వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget