గురుపూజ మహోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలుని సన్మానించిన ఉపాధ్యాయునీయులు.
కావలి మేజర్ న్యూస్: కావలి రూరల్ మండలం ఓట్టూరు గ్రామంలో గురుపూజ మహోత్సవం సందర్భంగా స్థానిక వెంకటేశ్వర పురంలో పనిచేయుచున్న ఎం. కుచలకుమారి కుమారిని ఒట్టురు పాఠశాలలో గురుపూజోత్సవ సందర్భంగా సన్మానించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా అదే రోజు ఆ మహనీయుని స్ఫూర్తితో ఉపాధ్యాయులు అందరూ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పాఠశాలలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరంవారు మాట్లాడుతూ, ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎంతో ఉన్నతమైనదని తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల ను సన్మానించడం ఎంతో ఉత్తమమని వారు తెలిపారు. విద్యార్థులని మంచి బాటలో నడిచేలా గురువులు తీర్చిదిద్దే తే మన దేశ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులను గొప్పగా వృత్తి చెందేలా గురువులు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరు ఐఏఎస్, ఐపీఎస్ ,డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు ఇలా కొన్నిటికే పరిమితం కాకుండా విద్యార్థులకు గొప్పగా ఎదిగేందుకు మరిన్ని అందుబాటులో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన సూచనలు ఇస్తున్నామని తెలిపారు. పిల్లలు ప్రతి ఒక్కరు ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా తన లక్ష్యాన్ని సాధించి ఇంతవరకు ప్రయత్నాన్ని విరమించలేదని వారిని ఆదర్శంగా విద్యార్థులు తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ సంబంధించిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.