తల్లిదండ్రులే మార్గదర్శకులు
నెల్లూరు(లీగల్) మేజర్ న్యూస్:
నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కే వాణి ఆధ్వర్యంలో ఈరోజు టీచర్స్ డే సందర్భంగా నెల్లూరు నగరం లోని మూలపేట లో ఉన్నటువంటి ఏనుగ సుందర రామిరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది .ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కే. వాణి పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలకు మంచి ఏదో చెడు ఏదో చెప్పాల్సిన తల్లిదండ్రులే ఏ టచ్ ఎలాంటిదో ఎవరిని దగ్గరగా రానివ్వకూడదు ఎవరు ఎక్కడ తాకకూడదు చెప్పడానికి సంకోచిస్తున్నారు ఈ ధోరణి వీడి పిల్లలకు మంచి ఏదో చెడు ఏదో వివరించాలి. పిల్లలకు మంచి చెడు టచ్ ల గురించి వివరించినారు. పిల్లలకు మంచి స్పర్శ చెడు స్పర్శ వంటి వాటిపై అవగాహన కల్పించినారు వాటి కోసం కొన్ని చిట్కాలను కూడా సూచించారు. తదుపరి పిల్లలకు భారత రాజ్యాంగం గురించి హక్కుల గురించి వివరించి తదుపరి బాల్య వివాహాల నిషేధం గురించి పిల్లలకు వివరించినారు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 సంవత్సరంలో నిషేధించి నేరంగా ప్రకటించింది అని తెలిపినారు. ఆనంతరం ర్యాగింగ్ గురించి వివరించినారు. మీకు ఏమి అవసరమైనా మా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదించవచ్చునని, అలాగే మా హెల్ప్ లైన్ నెంబర్ 15100 అలాగే ల్యాండ్ లైన్ నెంబర్ 08612330579 కు ఫోన్ చేయవలెనని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ శివరాం ప్రసాద్ , స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post a Comment