సంగం బ్యారేజ్ కు మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు కొనసాగించాలి జడ్పిటిసి రావుల లక్ష్మి
సంగం మేజర్ న్యూస్ : రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. గత ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నామకరణం చేసిన పేర్లను అదే విధంగా కొనసాగించేలా పునరాలోచించాలని సంగం జడ్పీటీసీ సభ్యురాలు రావుల లక్ష్మి అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి సంగం బ్యారేజ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి బ్యారేజ్ ను ప్రారంభించేకొద్ది రోజులము ముందుగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని మరణించారు ఆయన గుర్తుగా ఈ ప్రాంత ప్రజలందరూ కలకాలం గుర్తుంచుకునే విధంగా వైసీపీ ప్రభుత్వంలో ఆయన స్మృత్యార్థం ఏర్పాటు చేసిన ఆయన పేరును యథాతధంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన చేసిన మంచిని, ఆ కుటుంబం ఈ నియోజకవర్గనికి చేసిన అభివృద్ధిని చేసిన కృషిని గురించి పునరాలోచించి సంగంలోని బ్యారేజ్ కు మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ గానే కొనసాగించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు.
Post a Comment