పునరావాసం ప్రాంతంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
పునరావాసం నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలి.
సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
ముత్తుకూరు, సెప్టెంబర్ 6 (మేజర్ న్యూస్) నేలటూరు గ్రామపంచాయతీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పునరావాసం గృహాల్లో నాణ్యత ఉండాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పునరావాసం ప్రాంతాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ప్రభుత్వ అధికారులతో పాటు కాంట్రాక్టర్ సందీప్ రెడ్డితో ఎమ్మెల్యే చర్చించారు. ఇప్పటివరకు నిర్మాణ పనులు చాలా బాగున్నాయని ఎమ్మెల్యే అన్నారు. నిర్మాణ పనులు ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సుచించారు. అదేవిధంగా స్థానిక అధికార పార్టీ నాయకులు యానాటి శ్రీనివాసులు రెడ్డితో ఎమ్మెల్యే చర్చించారు. గత ప్రభుత్వంలో పునరావాసం పనులు జాప్యంపై అధికార పార్టీ నాయకులు యానాటి ఎమ్మెల్యేకి తెలియజేశారు. అదేవిధంగా నేలటూరుప్రజలు కాలుష్యంతో బాధలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ మల్లికార్జునరావు, తెలుగు యువత అధ్యక్షుడు ముని రెడ్డి, పార్టీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, విష్ణువర్ధన్ రావు,దీనయ్య, దాసరి శ్రీనివాసులు, బాబిరెడ్డి, బిజెపి, జనసేన నాయకులు వంశీధర్ రెడ్డి, సురేష్ బాబు, నాయకులు దండు శ్రీనివాసులు, అక్కయ్య గారి ఏడుకొండలు, నేలటూరు గ్రామ కాపులు, తదితరులు పాల్గొన్నారు
Post a Comment