కృష్ణపట్నం రోడ్డు మార్గానికి మోక్షం.
టిడిపి నేత రాగాల ఆధ్వర్యంలో జంగిల్ క్లియరెన్స్ పనులు.
పంచాయతీలో జనరల్ ఫండ్స్ ఉన్నా.. సొంత నిధులు ఖర్చు.
హర్షం వ్యక్తం చేస్తున్న కృష్ణపట్నం గ్రామస్తులు.
ముత్తుకూరు ,సెప్టెంబర్ 2 (మేజర్ న్యూస్) ఎట్టకేలకు కృష్ణపట్నం రోడ్డు మార్గానికి మోక్షం లభించింది. పారిశ్రామిక ప్రాంతమైన కృష్ణపట్నం రోడ్డు మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగివున్న కర్ర తుమ్మ చెట్ల వల్ల రోడ్డు మార్గం కనిపించకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ఈ చెట్లు తొలగించే కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు, మండల తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడు రాగాల శివకృష్ణ శ్రీకారం చుట్టారు. సోమవారం ఆయన దగ్గరుండి గోపాలపురం సెంటర్ వద్ద నుండి కృష్ణపట్నం వరకు రోడ్డుకు రెండు వైపులా ఉన్న కర్ర తుమ్మ చెట్లను జెసిబి ద్వారా తొలగించే పనులు చేయించారు. అనేక మలుపుల వద్ద ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయో అనే భయాందోళనలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా రాగాల స్పందించి ఈ పనులు చేయించారు. రాత్రి వేళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వాహన చోదకులు ఈ రోడ్డు మార్గంలో వచ్చేవారు. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులు వల్ల రోడ్డు నిర్మాణుషంగా కనబడుతుంది. స్థానికులు, పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, పరిశ్రమల కార్మికులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తప్పింది నాయన అంటూ రాగాలకు జనం కృతజ్ఞతలు తెలిపినారు. .
పంచాయతీలో జనరల్ ఫండ్స్ ఉన్నా .... సొంత నిధులు ఖర్చు.
కృష్ణపట్నం గ్రామపంచాయతీలో జనరల్ ఫండ్స్ సుమారు 7 లక్షల మేరకు ఉన్నట్లు సమాచారం గా ఉంది. సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ నిధులు అధికారులు ఖర్చు పెట్టాలి. ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఇక్కడ మాత్రం అధికారులు ఈ పనులు చేయలేకపోయారు. పంచాయతీల పుష్కలంగా నిధులు ఉన్నప్పటికీ గ్రామం సంక్షేమం కోసం ప్రజల ప్రాణ రక్షణకు అధికార పార్టీ నాయకులు రాగాల శివకృష్ణ ప్రస్తుతం సొంత నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. సొంత ఖర్చులు పెట్టి ప్రస్తుతానికి రోడ్డు ఇరువైపుల ఉన్న చెట్లు తొలగించారు. అధికారులు ఇప్పటికైనా గ్రామం కోసం ఉపయోగపడే నాయకులకు సహకరించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అంటున్నారు.
Post a Comment