విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
* జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్
నెల్లూరు క్రైం, మేజర్ న్యూస్:
విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 98 ఫిర్యాదులు.
'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్పీ కృష్ణ కాంత్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదిదారులతో జిల్లా యస్.పి. మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వచ్చిన ఫిర్యాదుల్లో :
కావలి రూరల్ పరిధికి చెందిన మహిళను 6 నెలల నుండి అనామకులు ఫోన్ చేసి, నగదు పంపాలని లేకపోతే నీ అసభ్యకర ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని, నీ బంధవులకు, సన్నిహితులకు పంపుతామని బెదిరిస్తూ 50 లక్షలు వరకు నగదు ఫోన్ ద్వారా వేయించుకున్నారని, ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తూ, వేధిస్తున్నారని యస్.పి. గారికి ఫిర్యాదు చేయగా, వెంటనే సైబర్ పోలీసులను విచారించాలని ఆదేశించి, భరోసా కల్పించారు.. _అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్ లకు భయపడి సైబర్ నేరాల ఊభిలో పడొద్దని, అనవసర లింక్ లు ఓపెన్ చేయవద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
బాలాజీనగర్ కు చెందిన మహిళ ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే శారీరకంగా, మానసికంగా వేధించడం, ఇంట్లో వారికి ఫోన్ చేసి బెదిరించడం చేస్తున్నాడని, రక్షణ కల్పించాలని కోరగా, వెంటనే విచారించి న్యాయం చేయాలని ఆదేశించారు.
విడవలూరుకు చెందిన మహిళను తన భర్త చెడు అలవాట్లకు లోనై తనని, పిల్లలను వేదిస్తూ, అప్పులు చేస్తూ, చంపుతానని బెదిరిస్తున్నాడని, ప్రాణ హాని ఉందని విన్నవించగా, వెంటనే రూరల్ డీఎస్పీలు న్యాయం చేయాలని ఆదేశించారు.
దగదర్తి పరిధికి చెందిన వ్యక్తిని ప్రభాకర్, మరో నలుగురు పొలం వివాదాల కారణంగా పెట్రోల్ పోసి తన ప్రొవిజన్ షాప్ తగలబెట్టినట్లు, వారం తరువాత గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు కొట్టి తన వేరు శనగ పంటను నాశనం చేసినట్లు, సదరు విషయమై విచారించి న్యాయం చేయాలని కోరారు. వెంటనే దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించచారు. మూలాపేట పరిధిలోని ఓ మహిళ, చిన్నపాటి కుటుంబ తగాదాల కారణంగా తన భర్త కనిపించడం లేదని, నా బిడ్డ పరిస్థితి బాగాలేక హాస్పిటల్ నందు ఉన్నామని, నా భర్త ఆచూకీ కనుగొని, మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వెంటనే క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, ఆచూకీ చెప్పాలన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వృద్దురాలిని కుటుంబ తగాదాలు మనసులో పెట్టుకొని మనవడు వేధింపులకు గురిచేస్తున్నాడని, విచారించి న్యాయం చేయాలని కోరగా, వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ హామీ ఇచ్చారు.
Post a Comment