చెత్త నుంచి సంపద తయారీపై అవగాహన
ఉదయగిరి మేజర్ న్యూస్ : పంచాయతీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణపై ఎంపీడీవో దేవరకొండ ఈశ్వరమ్మ అవగాహన కల్పించారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శి క్షణ కార్యక్రమంలో భాగంగా రెండోరోజైన మంగళవారం మండలంలోని గండిపాళెం గ్రామంలో గల చెత్త నుంచి సం పద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. గ్రామాల్లో ఇంటింటా సేకరించిన తడి, పొడి చెత్తను కేంద్రానికి తరలించాలన్నారు. కేంద్రంలో నిర్మించిన తొట్లలో వర్మీకంపోస్టు ఎరువు తయారీకి తీసుకోవాల్సిన చర్యలను వివరిం చారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ మల్లికార్జున, పంచాయతీ కార్యదర్శులు అమర్నాధరెడ్డి, కరీముల్లా, నాగూర్ బి , చంద్రశేఖర్, ఖాదర్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.
Post a Comment