బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
రికార్డుల పరిశీలన
నెల్లూరు కలెక్టరేట్ ( మేజర్ న్యూస్)
నెల్లూరు నగరంలోని దర్గామిట్ట వద్ద గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న భోజనం మెనూ వివరాలు, వసతి సౌకర్యాలను హెచ్ఎం విజయలక్ష్మి ని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు పట్టిక, పలు రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్, విద్యార్థుల నివాస గదులు, తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. ఆరో తరగతి, పదోతరగతి గదిలో విద్యార్థులతో మమేకమైన కలెక్టర్, వారి అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. రోజువారి సిలబస్ తో పాటు విద్యార్థులకు కనీస విషయ పరిజ్ఞానం ఉండేలా ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. టైం టేబుల్ ప్రకారం తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. వసతి గృహానికి అవసరమైన చిన్నచిన్న రిపేర్లను స్కూల్ మెయింటినెన్స్ ఫండ్ ద్వారా చేపట్టాలని హెచ్ఎం కు సూచించారు.
కలెక్టర్ వెంట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పరిమళ, ఉపాధ్యాయులు ఉన్నారు.
Post a Comment