పీసీ అండ్ పీఎన్ఢీటీ యాక్ట్ అమలపై సమీక్ష సమావేశం
నెల్లూరు (వైద్యం) మేజర్ న్యూస్
పీసీ అండ్ పీఎన్ఢీటీ యాక్ట్ అమలు తీరుతెన్నులుపై జిల్లాస్థాయి సలహా మండలి సమీక్ష సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం పెంచలయ్య అధ్యక్షతన మంగళవారం డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎం పెంచలయ్య మాట్లాడుతూ లింగ నిష్పత్తి ఎన్ ఎఫ్ హెచ్ ఎస్-5 సర్వే ప్రకారం ప్రతి 1000 మంది బాలురకు:1011 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. ఈ నిష్పత్తి తగ్గకుండా ఇంకా మెరుగుపరుచుటకు కమిటీ సభ్యులతో ఆకస్మిక తనిఖీలు స్కానింగ్ కేంద్రాలపై నిర్వహించుటకు కార్యచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్కానింగ్ కేంద్రాలు చట్ట పరిధిలోకి లోబడి నిర్వహించాలని, ప్రతినెల 2వ క్రమం తప్పకుండా నివేదికలో జిల్లా కార్యాలను సమర్పించాలని డిఎం అండ్ హెచ్ ఓ సూచించారు. ఈ సందర్భంగా పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాల పైన మరింత అవగాహన కార్యక్రమాలను రూపొందించి ఎన్జీవోలను భాగ్యసభలు చేసి తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. జిల్లా మెడికల్ బోర్డు సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో సరోగసి పద్ధతి ద్వారా సంతానం కావాలనుకున్న వారి దరఖాస్తులను పరిశీలించడం జరిగింది. సరోగసి ద్వారా సంతానం కావాలనుకున్నవారు దళారులను నమ్మి మోసపోవద్దని అందుకు సంబంధించిన సలహాలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎం పెంచలయ్య సూచించారు. ఈ సమావేశంలో డాక్టర్ పి ఎల్ దయాకర్, డాక్టర్ ఉమామహేశ్వరి, డాక్టర్ ఇందిరా, డాక్టర్ సర్దార్ సుల్తానా, డాక్టర్ సిహెచ్ కిరణ్, కుసుమకుమారి కవితరెడ్డి, ఐ.శ్రీనివాసరావు బి శ్రీనివాసరావు, కే కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.
Post a Comment