అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ద్వారా అత్యుత్తమ సేవలు అందించిన ఎస్.బాలకృష్ణ కు జిల్లా కలెక్టర్ చేతులు మీదగా ప్రశంసా పత్రం,
78వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా,అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ శ్రీ ఎ.ఎస్. దినేష్ కుమార్ గారు మరియు శ్రీ అమిత్ బార్డర్ ఐ పి ఎస్ గారిచే ఆర్థిక అక్షారాస్యతలో అత్యుత్తమ సేవలు అందించినందుకు ప్రశంసా పత్రము అందుకుంటున్న సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎస్. బాలకృష్ణ
ఈ సoదర్భంగా ఎస్ .బాలకృష్ణ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా మరియు కెనరా బ్యాంకుల
సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రాజెక్టు డైరెక్టర్ వి. ఆంజనేయులు మరియు ప్రాజెక్టు మేనేజర్ వి.అశోక్ కుమార్ పర్యవేక్షణలో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న జిల్లాల్లో 179 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను నడుపుతున్నట్లు తెలియజేశారు, అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 07 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పించామన్నారు . కేవలం అవగాహన కల్పించడమే కాకుండా సామాజిక భద్రతా పథకాలపై ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి పథకము, ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన , అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన , ఈ - శ్రమ్ కార్డులు , అభ ఆరోగ్య కార్డులు వంటి ప్రయోజనాలను పేద ప్రజలకు కల్పించడమైనదన్నారు. అలాగే బ్యాంకింగ్ ఆప్స్, క్యూ అర్ కోడ్ వాటి పై ప్రత్యేకమైన అవగాహన కల్పించి ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు నడిపిస్తున్నామన్నారు. బ్యాంకింగ్ రుణాలు,భీమా పథకాలు, డిపాజిట్ బ్యాంకింగ్ పథకాలు సద్వినియోగం చేసుకునేటట్లు ప్రోత్సహించామన్నారు మరియు సైబర్ క్రైమ్ పట్ల పూర్తి అవగాహన మా ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా జిల్లా కలెక్టర్ గారు ప్రశంసా పత్రం అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Post a Comment