మేత కోసం వెళ్లి వస్తున్న పశువులు.

 మేత కోసం వెళ్లి వస్తున్న పశువులు. 

అడవిలా... అల్ట్రా మెగా థర్మల్ కేంద్రం భూములు. 




15 సంవత్సరాల గా బీడుపడిన వైనం. 


ప్రభుత్వాలు మారుతున్నా.... పరిశ్రమల స్థాపన ఏది. 


వీధిన పడ్డ రైతులు.... ఆదుకునే నాధుడు ఎవరు. 


వ్యవసాయ ప్యాకేజీ అడుగుతున్నా .... పట్టించుకోని ప్రభుత్వాలు. 


ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రచారంలో ధర్మల్ కేంద్రం. 


2700 ఎకరాల భూములు బీడుపై అధికారులు ఏమంటారు.. 


పరిశ్రమల నిర్మాణం కోసం కృష్ణపట్నం ఎదురుచూపు. 


ముత్తుకూరు, ఆగస్టు 10( మేజర్ న్యూస్) సూపర్ క్రిటికల్ అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రం భూములు అడవిల మారినాయి. సముద్ర తీర ప్రాంతం వెంబడి కృష్ణపట్నం వద్ద సరిగ్గా సుమారు పదిహేను సంవత్సరాల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి స్వాధీనం చేసుకున్న సారవంతమైన భూములు నేడు కర్ర తుమ్మ చెట్ల తో నిండుకొని అడవిని తలపిస్తున్నాయి. అప్పటి ప్రభుత్వం ఎకరాకు 7 లక్షల 70 వేల రూపాయలు చెల్లింపులు చేయగామెట్టా ,మాగాణి భూములు సుమారు 2700 ఎకరాలను రైతుల నుండి తీసుకోవడం జరిగింది. . సన్న , చిన్న కారు రైతులు భూములను ధర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి భూములు ఇచ్చి త్యాగం చేశారు. మట్టిని నమ్ముకుని బతుకుతున్న రైతాంగానికి థర్మల్ విద్యుత్ కేంద్రం ఆశ పెట్టింది. ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వస్తాయని అప్పుడు యాజమాన్యం చెప్పడంతో సంతోషాన్ని చూపారు. తీరాసంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రాజెక్ట్ నిర్మాణం లేదు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ప్రాజెక్ట్ నిర్మాణం లేకపోవడం వల్ల పెద్ద అడవిలాగా ఈ భూములు తయారై విష సర్పాలకు నిలయంగా ఉన్నాయి. 


టిడిపి ప్రభుత్వం లో అయినా పరిశ్రమలు వస్తాయా. 


నూతనంగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వంలో అయినా కృష్ణపట్నం అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రం భూముల్లో పరిశ్రమల స్థాపన జరుగుతుందా అనేది కృష్ణపట్నం గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అప్పట్లో 16 వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని చెప్పిన కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ కేవలం 1600 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చివరకు ఈ భూములను బీడు పెట్టింది. గత ప్రభుత్వం ఈ భూముల్లో పరిశ్రమలు స్థాపన చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం రైతులు తెలుగుదేశం ప్రభుత్వం పై ఆశలు పెట్టుకుంటున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి అనుభవం కలిగిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన పరిపాలనలో ఈ భూములకు మహర్దశ వస్తుందని కృష్ణపట్నం వాసులు నమ్ముతున్నారు. పారిశ్రామిక రంగంలో కృష్ణపట్నం కేంద్రంగా ఇప్పటికే అనేక పరిశ్రమలు స్థాపన జరిగింది. వేల ఎకరాల భూములు బీడు ఉండడం పై రైతులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రాజెక్టు ఇక్కడ నిర్మాణం జరిగితే విద్య ,వైద్యం, ఉపాధి రంగాలు మెరుగుపడతాయని ఆర్థిక అభివృద్ధి లభిస్తుందని జిల్లా వాసులు సంతోషపడుతున్నారు. చంద్రబాబు పరిపాలనలో కృష్ణపట్నం లో పరిశ్రమలు నిర్మాణం జరగాలని జనం కోరుకుంటున్నారు. 


వ్యవసాయ కూలీలకు ప్యాకేజీ ఇవ్వాలి. 


పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం తో పాటు కూలి కోల్పోయిన వ్యవసాయ కూలీలకు ప్రభుత్వాలు ప్యాకేజీ రూపంలో కొంత నగదు చెల్లించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ కార్మికులు అంటున్నారు. రోజువారి వేతనాన్ని చెల్లించేవిదంగా సర్వే చేయాల్సిన అవసరం ఉందని వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 2000 వేల మందికి పైబడి వ్యవసాయ కార్మికులు ఈ భూముల్లో పని చేసుకుని బతికేవారు. నేడు ఆ కార్మికులంతా వీధిన పడ్డారు. సంవత్సరానికి లక్ష రూపాయలు లెక్కించిన 15 సంవత్సరాలకు 15 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కార్మికులకు కోరుతున్నారు. అదేవిధంగా వ్యవసాయం కోల్పోయిన రైతు కుటుంబాలకు కూడా పంట అంచనా వేసి పరిహారం ఇవ్వాల్సి ఉందని భూములు కోల్పోయిన రైతులు అంటున్నారు. ఏది ఏమైనా టిడిపి ప్రభుత్వ పరిపాలనలో ఇక్కడ పరిశ్రమల నిర్మాణం జరగాలని ఆశిద్దాం.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget