క్యాన్సర్ గురించి తెలుసుకుందాం - మనల్ని మనం కాపాడుకుందాం.

 క్యాన్సర్ గురించి తెలుసుకుందాం - మనల్ని మనం కాపాడుకుందాం.





 కరపత్రాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్


నెల్లూరు(వైద్యం)మేజర్ న్యూస్


కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పిఎంపి అసోసియేషన్) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పీ.హెచ్.పీ నాయకులు మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ను కలిసి, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, మున్సిపల్ పాఠశాలలందు క్యాన్సర్ కారణాలు, పర్యావరణ కాలుష్యము, ప్లాస్టిక్ వాడకంవల్ల నష్టాలు గురించి అవగాహన కల్పించుటకు, ర్యాలీలు నిర్వహించుటకు అనుమతి కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం క్యాన్సర్ గురించి తెలుసుకుందాం - మనల్ని మనం కాపాడుకుందాం  కొన్ని క్యాన్సర్ల కారణాలు, వాటి లక్షణాలు, ప్లాస్టిక్ వాడకం వల్ల నష్టాలు అనే కరపత్రికను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న పీ.ఎం.పీ, ఆర్.ఎం.పి, గ్రామీణ వైద్యులు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్య పరచాలని, చికున్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా తదితర వ్యాధులు పట్ల ఎవరైనా మీవద్దకు వస్తే ప్రాథమిక చికిత్స అందించి దగ్గరలోని పీ.హెచ్.సి, జి.జి.హెచ్ కి  పంపించాలని, గ్రామీణ వైద్యులు ఎవరు కూడా పరిధికి మించి వైద్యం చేయరాదని, చట్టాలను గౌరవిస్తూ, ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ, గ్రామీణ ప్రజల ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా పీ.హెచ్.పీ నాయకులు కలెక్టర్ ను శాలువా, పూలమొక్కతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శాఖవరపు వేణుగోపాల్, గోరంట్ల శేషయ్య, నరసాపురం ప్రసాద్, ఉప్పలపాటి రామదాసు, బైరి శంకర్రావు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget