విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి
ఉదయగిరి మేజర్ న్యూస్ : విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, వాటికి దూరంగా ఉండి భవిష్యత్తుకు బంగారుబాటలు వేసు కోవాలని ఎస్ఐ కర్నాటి ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మేకపాటి రాజమోహన్ రె డ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ ఏ. నరసింహులు అధ్యక్షతన నషా ము క్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'మాదకద్రవ్యాలు విక్రయించినా, సేవించినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఎవరైనా వాటిని విక్రయించినా, సేవించినా తమకు సమాచారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ అన్నార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డీ.వెంకటసుబ్బయ్య, ఐక్యూ ఏసీ కేసీ విక్రమ్. ఆధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post a Comment