మదర్ థెరిసా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన విశ్రాంతి సంక్షేమ అధికారిబాషా.
కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణంలో సోమవారంమదర్ థెరిస్సా 114వ జయంతి వేడుకలను కావలి డివిజన్ పిఎంపి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు విశ్రాంత వసతి గృహ సంక్షేమ అధికారి షేక్ బాషా ఆధ్వర్యంలో బాపూజీ నగర్ లో ప్రభుత్వ బిసి బాలికల కళాశాల గృహం నందు మరియు ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహ సముదాయం నందు చిన్నారులు మధ్యలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం భాష మాట్లాడుతూ, 1910 వ సంవత్సరం లో విశ్వమాత మదర్ థెరిస్సాఅల్బెనియా దేశంలో జన్మించి ఆర్.సి.యం సన్యాసిగా భారతదేశానికి చూడడానికి వచ్చి ఇక్కడ పరిస్థితులను తెలుసుకొని భారతదేశ పౌరసత్వాన్ని తీసుకొని 1950 సంవత్సరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీని భారత దేశంలో కలకత్తా నందు స్థాపించి భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా వ్యాపించేలా మార్గదర్శకత్వం వహించి నిరుపేదలకు, వ్యాధిగ్రస్తులకు, అనాధలకు, కుష్టి, క్షయ, వ్యాధిగ్రస్తులకు మరణం చేరువయ్యేవారికి ఆమె చిరునవ్వు కళ్ళల్లో కరుణ, నిష్కలంక మైన మనసుతో పరిచర్యలు సేవాభావంతో అంకితభావంతో వారికి సర్వీస్ చేశారు. మదర్ థెరిస్స చేసిన విశిష్ట సేవలకు 1962లో పద్మశ్రీ 1972లో నెహ్రూ అవార్డు 1979లో నోబుల్ బహుమతి 1980లో భారతరత్న అవార్డులు ఆమెకు లభించినాయి. మరణించే నాటికి 123 దేశాల్లో 610 సంఘాలు కలిగి హెచ్ఐవి, కుష్టి ,క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలు, ఆహార కేంద్రాలను, అనాధ శరణాలయం, మరియు పాఠశాలను స్థాపించి పేద ,బడుగు, బలహీన, వర్గాలకు వారికి అనేక రకములైన వ్యాధిగ్రస్తులకు ఎనలేని సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి దత్తమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రసాదరావు, విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు అజిత్ బాబు, వసతి గృహ సంక్షేమ అధికారులు విజయలక్ష్మి, నాగేశ్వరి ,మరియు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment