ఐక్యరాజ్య సమితిలో అధికార భాషగా హిందీ
న్యూయార్క్ లో దౌత్యాధికారి రవీంద్రన్ తో అచార్య యార్లగడ్డ భేటీ
భారత ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలు, అంతర్జాతీయ మధ్దతు ఆవశ్యకతపై చర్చ
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజ్యసభ మాజీ సభ్యుడు, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత రాయబార కార్యాలయం లో దౌత్యాధికారి రవీంద్రన్ ను గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో హిందీని అధికార భాషగా గుర్తింపుకు చేయవలసిన ప్రయాత్నాలను గురించి వీరిరువు చర్చించారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఫ్రెంచి, ఇంగ్లీష్, చైనీస్, రష్యన్, అరబిక్, స్పానిష్ ఆరు భాషలు మాత్రమే అధికార భాషలుగా వున్నాయి. ఐక్యరాజ్య సమితిలో అటల్ బిహారి వాజపేయి, పి.వి.నరశింహారావు, నరేంద్రమోడిలు మాత్రమే హిందీలో ఇప్పటివరకు ప్రసంగించారని యార్లగడ్డ గుర్తు చేశారు. దౌత్యాధికారి రవీంద్రన్ ప్రభుత్వ పరంగా చేస్తున్న ప్రయత్నాలను యార్లగడ్డ కు వివరించారు. హిందీ అధికార భాషగా చేర్చాలంటే ఐక్యరాజ్య సమితి లోని 196 దేశాలలో మూడవ వంతు దేశాలు మద్దతు ఇవ్వాలని రవీంద్రన్ చెప్పారు. ఆయా దేశాలలోని ప్రవాస భారతీయులు అక్కడి ప్రభుత్వాల సమర్ధన పొందేవిధంగా పని చేయవలసి ఉంటుందని యార్లగడ్డకు తెలిపారు. అధికార భాషగా హిందీ గుర్తింపు పొందడానికి అవసరమైన నిధుల మంజూరు విషయంలో కూడా భారత ప్రభుత్వం సిద్దంగానే ఉందని, ఇప్పటికే మిలియన్ డాలర్ల నిధలు మంజూరు అయ్యాయని వివరించారు. అంతకు ముందు అచార్య యార్లగడ్డ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలోని భాషా విభాగం అధికారులతో సమావేశమై హిందీ అధికార భాషగా గుర్తింపు పొందే విషయంపై పూర్వాపరాలను చర్చించారు.
Post a Comment