భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు.
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం లో నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ల (IAS)ల ఫోర్జరీ కేసు లో కేవలం అధికారులే కాకుండా కొంతమంది వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు మరియూ బడా నాయకులు ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఈ కేసు విషయంలో పోలీసు అధికారులు నిష్పక్షపాతం గా వ్యవహరించాలని కోరుతూ..
అదేవిధంగా 2014-19 సం,, గత ప్రభుత్వం లో నిర్మించిన టిట్ కో ఇళ్లు ని అర్హులైన పేద ప్రజలందరికీ ఇవ్వాలని లేకపోతే ప్రజలు డి డి ల రూపంలో కట్టిన డబ్బును ప్రజలకి తిరిగి ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు. నారాయణ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగినది.
ఈ విషయమై మంత్రి వర్యులు స్పందించి పై విషయాల మీద తగు చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగరాల.సురేష్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ కన్వీనర్ మండ్ల.ఈశ్వరయ్య,వేదయపాలెం మండల బీజేపీ అధ్యక్షులు పి.మల్లికార్జున, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యాకసిరి. ఫణి రాజు,ఉపాధ్యక్షులు గుంజి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment