క్షేత్రస్థాయి పర్యటనకు విద్యార్థులు

 క్షేత్రస్థాయి పర్యటనకు విద్యార్థులు




ఉదయగిరి మేజర్ న్యూస్.

స్థానిక మేకపాటి గౌతంరెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో రెండవ సంవత్సరం, రెండవ సెమిస్టర్ పూర్తి చేసుకున్న వ్యవసాయ విద్యార్థులు మం గళవారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి అసోసియేట్ డీన్ కేఎస్ఆర్ పాల్ మాట్లాడుతూ 80 మంది విద్యార్థులతోపాటు అధ్యాపకులు, సిబ్బంది మూడు రోజులపాటు ఈ పర్యటనకు వెళ్లనున్నారన్నారు. కడప, తిరుపతి, నెల్లూరు, కావలిలో గల వివిధ పరిశ్రమలు, కృషివిజ్ఞాన కేంద్రాలు. 'రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రగతి, యువ కేంద్రం, పరిశోధనల సంస్థలు, ఉద్యాన కళాశాలలను సందర్శించడం జరుగుతుందన్నారు. ఈ విద్యా పర్యటనతో విద్యార్థులకు అవగాహన, అనుభవం కలుగుతాయన్నారు. అనంతరం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు నారాయణస్వామి, కిషన్ తేజ, అశోక్, క్రాంతిబోదన, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget