కుల మత ఆర్థిక అసమానతలను రూపుమాపగల శక్తి విద్యకు ఉంది

 కుల మత ఆర్థిక అసమానతలను రూపుమాపగల శక్తి విద్యకు ఉంది




 పాఠశాల ప్రధమ, ద్వితీయ, తృతీయ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తాం 


గునుకుల కిషోర్

జనసేన నాయకులు


నెల్లూరు( జడ్పీ )మేజర్ న్యూస్ 


78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జనసేన పార్టీ తరపున నెల్లూరు సిటీ ప్రభుత్వ మోడల్ హై స్కూల్ మరియు కాలేజీ నందు సీనియర్, జూనియర్,సబ్ జూనియర్స్ విబాగాలకు మంగళవారం వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది.


ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ... 


ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను అభ్యసించి పిల్లలు ఉన్నత స్థాయిలకు వెళ్లాలని 

ఉచితంగా విద్యను అందిస్తున్న మోడల్ హై స్కూల్ నెల్లూరు కే తలమానికంఅని ఇక్కడ చదివిన విద్యార్థులు ఎందరో ఉన్నత స్థాయిలలో తమ ప్రతిభ చాటారని నేను కూడా ఇక్కడే చదువుకున్నానని  ఉచిత విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రోత్సహిస్తున్న నాయకులందరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు 

ఎందరో

మహనీయులత్యాగ ఫలం మన స్వాతంత్రం. స్వాతంత్ర దినోత్సవం ను ఒక వేడుకలా నిర్వహించాలని మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  సూచనల తో  వ్యాసరచన పోటీలు వంటివి నిర్వహించి,విజేతలకు ఆగస్టు 15 బహుమతులు అందజేస్తామని తెలిపారు.

పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వ్యాస రచన పోటీలు నిర్వహించడం ఎంతో అవసరం అని తెలిపారు 

స్కూలు గ్రౌండ్ విషయంలో చొరవ చూపినందుకు అభినందనలు తెలిపారు.

కానీ పిల్లల్ని తమ సొంత పిల్లల వలే బాధ్యత తీసుకొని,ఈ రోజున మీరే చదివే చదువుతో రేపటి సమాజాన్ని మార్చగలం. మీరందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలతో ఉన్నత స్థాయిలతో తిరిగి పాఠశాలకు రావాలని నిరంతరం పిల్లకు గుర్తు చేస్తూ చదివిస్తున్నందుకు  ఉపాధ్యాయులకే అభినందనలు తెలపారు 

ఇక్కడ చదువుకొని ఉన్నత మార్కులు సంపాదించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం సంతోషకరమని తెలిపారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget