అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దామనపల్లి పంచాయితీ బొర్రామామిడి గ్రామములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా.
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దామనపల్లి పంచాయితీ బొర్రామామిడి గ్రామములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా.చంద్రబాబునాయుడు మరియు డిప్యూటీ సీఎం కొణిదెల.పవన్ కళ్యాణ్ అదేశాలు మేరకు దామనపల్లి పంచాయితీ సర్పంచ్ కుందేరి రామకృష్ణ పంచాయితీ సెక్రటరీ కళ్యాణ్ ఆధ్వర్యంలో"వనం మహోత్సవం" కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణ మరియు బీజేపీ పార్టీ అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి మరియు ఎ.ఎస్.ఆర్.జిల్లా బీజేపీ పార్టీ సోషల్ మీడియా కన్వినర్,దుక్కేరి.ప్రభాకరరావు,మాట్లాడుతూ పర్యావరణన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కనుక అందరం తుచతప్పకుండ మన వంతుగా మొక్కలను నాటించి మన భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి నీరు వాతావరణంన్ని సమాకూర్చాలని ఇప్పటికే మానవుడి స్వార్ధంతో ప్రకృతినీ కాకవికాలం చేస్తూ వినాశం చేస్తూ తన జీవితకాల రేటును గణనియంగా తగ్గిపోయిందని ఇకనైనా మానవుల్లో అడవులను వృక్ష సంపదను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో వంతల.చంటిబాబు,సచివాలయం సిబ్బంది,ఎన్.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. సభ్యులు మరియు స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,
Post a Comment