షార్ రిటైర్డ్ ఉద్యోగులకు సన్మానం.
సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సూళ్లూరుపేట సిఐ.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
పట్టణంలోని డి ఓ ఎస్ కాలనీ వద్ద షార్ రిటైర్డ్ ఉద్యోగస్తుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రదేశాలనుంచి వచ్చిన రిటైర్ ఉద్యోగులు హాజరయ్యారు. బుధవారం పినాకినినగర్ (డి ఓ ఎస్, డి ఆర్ డి ఎల్ ) కాలనీలో ఐఎస్ఆర్వో షార్లో సర్వీస్ చేసి 75 సంవత్సరాల నిండిన 20మంది రిటైర్డ్ ఉద్యోగులకి సన్మానం చేశారు. ఈ సన్మానానికి కుమారస్వామి ప్రధాన కార్యదర్శి సభ్యులను ఆహ్వానించగా పిజెసి రెడ్డి అధ్యక్షత వహించారు సన్మానానికి సీఐ యం మురళీకృష్ణ గారు సన్మాన గ్రహీతలకి షాలు,మోమెంటోతో సత్కరించడమే కాకుండా సీనియర్ సిటిజన్స్ కు వచ్చే సాధారణ సమస్యలను, ఎలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి తెలియజేశారు. సమస్యలను తీర్చడానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఇంకో ముఖ్య అతిథి షార్ సిహెచ్ఎస్ సీనియర్ అధికారి విజయభాస్కర్ విహెచ్ యస్ యస్ (మెడికల్ స్కీము) ఉపయోగము జాగ్రత్తలను గురించి, స్కీము సౌలభ్యంగా ఉండడానికి సహకరిస్తామని తెలియజేశారు. స్థూలంగా సీనియర్ సిటిజన్స్ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గౌరవాధ్యక్షుడు ఆదిశేష రెడ్డి తెలియజేశారు. వ్యాఖ్యాతులుగా సాంబ శివయ్య, ప్రేమనాధరెడ్డి, ఆదిశేషు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుదర్శనరావు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట సిఐ, వివిధ ప్రదేశాలనుంచి వచ్చిన రిటైర్ ఉద్యోగులు, మరియు శ్రీ కమిటీ సభ్యులు హాజరయ్యారు.
Post a Comment