పంచాయతీ సమస్యలు పరిష్కరించండి
బిజెపి నేత దుక్కెరి ప్రభాకర్
గూడెం కొత్తవీధి,పెన్ పవర్ ఆగస్ట్ 23: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ కేంద్రంలో సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా బిజెపి నాయకులు దుక్కెరి ప్రభాకర్ పంచాయతీలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అందులో ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీలో చేపట్టవలసినటువంటి సిసి రోడ్లు,డ్రైనేజీ, పంట కాలువలు, పాఠశాలల్లో ప్రహరీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక దృష్టి సారించాలని వినతి పత్రంలో కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సర్పంచ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామనిహామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భీమరాజు,మాజీ ఎంపీపీ సాగిన బాలరాజు సచివాలయం కార్యదర్శి కళ్యాణ్ కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
Post a Comment