వి ఎస్ యు లో తెలుగు భాషా వైభవం ముగింపు రోజు ...
వెంకటాచలం మేజర్ న్యూస్....
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, తిక్కనసాహితీ పీఠం తెలుగు శాఖ వారు గిడుగు వెంకట రామమూర్తి పంతులు 161 వ జన్మదిన సందర్భంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో "తెలుగు భాష వైభవం" అనే రెండు రోజుల జాతీయ సదస్సులో ముగింపు కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి గిడుగు రామమూర్తి పంతులు గారి చిత్ర పటానికి పూలమాల అలంకరించిన పిదప మాట్లాడుతూ తెలుగు వారి సంస్క్రతి, ప్రాచీన సాహిత్య విశిష్టత, పుస్తక పఠనం ఆవశ్యకత గురించి తెలిపారు.తెలుగు భాష. కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేశారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత గిడుగు వారు వ్యావహారిక భాషా సేవ ను కొనియాడుతూ, మాతృ భాషలో మన భావ ప్రకటన స్వేచ్ఛగా చేయగలిగినపుడే ఇతర భాషలు సులభంగా నేర్చుకో గలం అన్నారు.
ఈ కార్యక్రమంలో గిడుగు రామ మూర్తి గారి జీవిత విశేషాలు,రచనలు అనే అంశంపై డాక్టర్ కరి మద్దెల నరసింహారెడ్డి ప్రసంగిస్తూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. డాక్టర్ గంగిసెట్టి శివకుమార్ గిడుగు వారి వ్యావహారిక భాషా సేవ గురించి వివరించారు.
అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ విజయ తెలుగు శాఖ అధిపతి డాక్టర్ ఎం. త్యాగరాజు విశ్వవిద్యాలయ ఆచార్యులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Post a Comment