శ్రీహరికోట షార్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
రవి కిరణాలు తిరుపతి జిల్లా (సూళ్లూరుపేట) శ్రీహరికోట:-
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం లో మంగళవారం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పర్యటించనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఉదయం 9 గంటలకు ఆయన ఇస్రో షార్ సెంటర్ కు చేరుకుని నక్షత్ర గెస్ట్ హౌస్ లో బసచేస్తారు అనంతరం కురుప్ ఆడిటోరియం లో జరిగే ఇస్రో స్పేస్ డే కార్యక్రమం లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అనంతరం షార్ లోని రాకెట్ ప్రయోగ వేదికను ఆయన సందర్శిస్తారు.అనంతరం తిరిగి హెలీకాఫ్టర్లో రేణిగుంటకు చేరుకోవడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి రాకతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ శ్రీహరికోటకు చేరుకుని అక్కడ అధికారులతో ఏర్పాట్లు ఎమ్మెల్యే తో పాటు ఇస్రో చైర్మన్ సోమనాధ్ కూడా
ఉపముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.