అవ్వాతాత కళ్లల్లో ఆనందం చూస్తున్నా - మంత్రి నారాయణ
- ఉదయం 6 గంటలకే ప్రారంభమైన ఫించన్లు పంపిణీ
- స్వయంగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి ఫించన్లు అందచేసిన మంత్రి పొంగూరు నారాయణ
నెల్లూరు నగరం 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో తెల్లవారుజామున 6 గంటలకే ఫించన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...టీడీపీ నాయకులతో కలిసి స్వయంగా ఇంటి వద్దకే వెళ్లి...అవ్వాతాతల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి రూ. 4వేల ఫించను నగదును అందచేశారు. ఏం అవ్వా...ఏం తాత...చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారమే...రూ. 4వేల పెన్షన్‌ని మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నామని వారికి మంత్రి నారాయణ తెలియజేశారు. దీంతో...లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నారాయణ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్..టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి ..టిడిపి ముఖ్య నేతలు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Post a Comment