జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించండి : జాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవితేజ
నెల్లూరు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవితేజ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందజేసేలా జీవోను మరింత సరళీకృతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళగా ఆయన సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు ధర్మసన ఉదయ్ కుమార్, పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు
Post a Comment