సమిష్టిగా పని చేసి జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకొద్దాం
అనంతపురం :
సమిష్టిగా పని చేసి జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకొద్దాం
* శాంతిభద్రతల పరిరక్షణలో అందరం మమేకమై జిల్లాను ప్రశాంతంగా ఉంచుదాం
* మనమంతా ఒక కుటుంబం... మీరు, నేను వేరుకాదు...ఏవైనా అందరం కలిసే కృషి చేద్దాం
* ఏ.ఆర్ పోలీసులు, హోంగార్డులు నిర్వహించిన పరేడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ
జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ IPS గారు
* అనంతపురం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ IPS గారు ఏ.ఆర్ సాయుధ బలగాలు, మరియు హోంగార్డులు నిర్వహించిన పరేడ్ ను తనిఖీ చేశారు
* ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. పరేడ్ బాగా చేశారు. యూనిఫాం సర్వీస్ లో ఏ.ఆర్ , హోంగార్డులు సివిల్ పోలీసులతో పాటు ప్రాధాన్యతగా సేవలు అందిస్తున్నారు. చాలా బాధ్యతగా విధులు చేస్తున్నారు. ప్రిజినర్స్ ఎస్కార్ట్, గార్డు విధులతో మొదలుకొని అన్నిరకాల విధులు అంకితభావంతో చేస్తారు. అనంతపురం జిల్లా ఏ.ఆర్ పోలీసులకు రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉంది. క్రమశిక్షణ, అంకితభావంతో పని చేస్తారనే భావన ఉంది. ఇంకా బాగా పని చేయండి మీ విధులు, సంక్షేమం, మీ సమస్యల పరిష్కారం గురించి కృషి చేస్తాను. అందరికీ సమాన విధులు ఉండేలా చేస్తాం. ఒత్తిడి తగ్గించేందుకు కృషి చేస్తాం. సమాజంలో యూనిఫాంకు మంచి విలువలు ఉన్నాయి. పోలీసుశాఖకు చెడ్డపేరు తెచ్చేవిధంగా ఎవరూ ప్రవర్తించరాదు. యూనిఫాం ధరించి విధుల్లో ఉన్నప్పుడు పోలీసుశాఖ ప్రతిష్ట పెరిగేలా మసలుకోవాలి. ప్రజలతో ఉన్నప్పుడు మంచిగా మెలగాలి. పనిష్మెంట్ లు ఇచ్చి పని చేయించుకోను. కానీ... అంతదాకా తీసుకురాకండి. మీరంతా నా వాళ్లు. మనమంతా ఒక కుటుంబం అనే భావనలో ఉంటాను. ప్రిజినర్స్ ఎస్కార్ట్, పికెట్ విధుల్లో ఎలా ఉండాలో సూచనలు చేశారు. సివిల్ పోలీసులు, ఏ.ఆర్ పోలీసులు సమిష్టిగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం మెరుగదల మరియు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రతీరోజూ గ్రౌండు, ప్రాక్టీస్ వదలకూడదు. మీ ఆరోగ్యం బాగుంటునే మీ కుటుంబం కూడా బాగుంటుందని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యంతో పాటు మానసికంగా దృఢంగా ఉంటేనే విధుల్లో సమర్థవంతంగా పని చేయవచ్చు.
* ఆతర్వాత... ఏ.ఆర్ , హోంగార్డులను ముఖాముఖిగా మాట్లాడి వారి విధుల్లో మరియు ఆరోగ్య, విద్య, తదితర అంశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు
* ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్ .విజయభాస్కర్ రెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజ, ఆర్.ఐ లు మధు, రాముడు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్, జిల్లా సభ్యులు సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, పలువురు ఆర్ ఎస్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment