తిరుపతి పట్టణానికి త్రాగునీటి సరఫరాకు సంబంధించిన కండలేరు పూడిక తీత పనులను త్వరితగతిన పూర్తి చేసి నీరు విడుదలకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్
రవి కిరణాలు,తిరుపతి, జులై 6 : -
తిరుపతి పట్టణానికి త్రాగునీటి సరఫరాకు సంబంధించిన కండలేరు జలాశయ పూడిక తీత పనులను త్వరితగతిన పూర్తి చేసి ఈ నెల 21 నాటికి నీరు విడుదలకు ప్రణాళికా బద్ధంగా సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత ఇరిగేషన్, తిరుపతి మునిసిపల్ అధికారులను ఆదేశించారు.
శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు నగరపాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ అదితి సింగ్ తో కలిసి తిరుపతి పట్టణంలోని ప్రజలకు త్రాగు నీటిని సరఫరా కొరకు నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ ఇరిగేషన్ విజయకుమార్, మునిసిపల్ అధికారులతో సమీక్షిస్తూ కండలేరు జలాశయం నుండి నీటిని పట్టణ ప్రజలకు త్రాగు నీటి కొరకు విడుదల కొరకు జలాశయంలో పూడిక తీత టెండర్లు ఈ నెల 9 నాటికి చేపట్టి తదనంతర ప్రక్రియ ప్రణాళికా బద్ధంగా చేపట్టి ఈ నెల జూలై 21 నాటికి తిరుపతి మునిసిపాలిటీకి నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే రోజుకు 250 క్యూసెక్కుల నీటిని ఒక నెలపాటు విడుదల చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఈ పబ్లిక్ హెల్త్ మోహన్, నెల్లూరు తెలుగు గంగ ప్రాజెక్టు ఎస్ ఈ రమణారెడ్డి, నెల్లూరు కండలేరు ప్రాజెక్టు ఈ ఈ విజయ్ కుమార్ రెడ్డి, వెంకటగిరి తెలుగంగ ప్రాజెక్ట్ ఈ ఈ రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment