ఆదోని జాప్ డివిజన్ మహాసభ జయప్రదం
ఆదోని పట్టణంలో సోమవారం రెడ్డి ఫంక్షన్ హాల్ నందు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ డివిజన్ మహాసభ ఘనంగా జయప్రదం చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు రవి తేజ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు యం.ఎల్.సి డా . మధుసూదన్ , బి.జె. పీ రాష్ట్ర నాయకులు అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి ,బాపురం రామకృష్ట , మధుసూదన్ గారు మాట్లాడుతూ సుదీర్ఘ చరిత్ర కలిగిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆవిర్భావం నుండి నిత్యం జర్నలిస్టుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది కాలాను గుణంగా మీడియాలో చోటు చేసుకుంటున్న సమూల మార్పుల అనుగుణంగా జర్నలిస్టులకు బంగారు భవిష్యత్తు కల్పించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా స్వరం చట్టసభల్లో వినిపించేలా మహాసభలు నిర్వహణ చేపట్టడం నిజంగా హర్శించదగ్గ విషయం అని కొనియాడారు .ఇందులో భాగంగా ఆదోనిలో సోమవారం మహాసభ జరిగింది. ఈ సభకు కర్నూలు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రాజా నరేష్ కుమార్ యాదవ్ ,సునీల్ కుమార్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.
Post a Comment