బాలన్న మార్పు మంచిదే...
బాలచంద్రారెడ్డి రాజీనామా! ఇప్పుడు ఇదే సుళ్ళూరుపేట నియోజకవర్గ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది
బాలచంద్రారెడ్డి రాజీనామా!!! ఇప్పుడు ఇదే సుళ్ళూరుపేట నియోజకవర్గ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది
రాజకీయాలలో హుందాగా వ్యవహరించే బాలన్న నిర్ణయం మంచిదేనా
తెలుగుదేశం పార్టీలోకి వస్తానంటే.. ఆహ్వానించడానికి ఆ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా
బలమైన నాయకుడు చేజారిపోయాడని బాధలో ప్రతిపక్షం ఉందా
బాలచంద్రారెడ్డి ఓట్ బ్యాంక్ ఎంత
మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్టుంది సుళ్ళూరుపేటలో వైసీపీ పరిస్థితి.
అసలే గడ్డుకాలం.. ఆపై ప్రధాన నాయకులంతా పార్టీకి దూరం..దూరం
బాలచంద్రారెడ్డి రాజీనామాకు కారణాలు ఏమిటో ఒకసారి విశ్లేషించుకుందాం.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
సుళ్ళూరుపేట నియోజకవర్గంలో మంచిపట్టున్న నాయకుడిగా బాలచంద్రారెడ్డికి మంచి గుర్తింపు ఉంది.
రాజకీయాలలోనేకాకుండా వ్యక్తిగతంగా కూడాహుందాగా వ్యాహరిస్తాడనే మాంచి .. గుర్తింపు కూడా ఉంది.. రాజకీయంగా పార్టీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకువెళతాడే తప్ప.. ఎక్కడ ఎవరిని కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యక్తిగతంగాకూడా విమర్శించిన దాఖలాలు లేవు...
అసలు అయన పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరవ్వడం అరుదు.
సహాయమని ఎవరు వెళ్లిన.. ఆయన స్థాయికి తగ్గట్లుగానే సహాయం. అందిస్తాడని. దొరవారిసత్రం మండలంలో. ఎవరిని అడిగినా చెప్తారు.
ఇవన్నీ పక్కన పెడితే.
పార్టీ పరంగా.
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించిన.తరువాత..అయనవెంటే నడిచాడు. పదవులు ఆశించకుండా
పార్టీ కోసం కష్టపడి పని చేసాడు. ఇక అప్పటినుండి రాష్ట్రంలో. అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే.
దొరవారిసత్రం మండలంలో మాత్రం. వైఎస్ఆర్సిపి పార్టీ మెజారిటీగా కొనసాగింది అది కూడా.
బాలచంద్రారెడ్డి. స్టామినాతో.
ఎలక్షన్ ఏదైనా. బాలచంద్రారెడ్డి మార్కు. ఫలితాలు దొరవారిసత్రం మండలంలో కనిపించేవి అప్పట్లో.
అప్పట్నుంచి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దొరవారిసత్రం మండలంలో తనదైన శైలి రాజకీయం చేసి. అప్పటి కొత్త అభ్యర్థి.సంజీవయ్య విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు . 2014 నుండి 2019 వరకు రాష్ట్రములో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఒక సుళ్ళూరుపేట నియోజకవర్గంలో మాత్రం. వైసిపి విజయం సాధించింది.. మొన్నటి వరకు సంజీవయ్య చుట్టూ తిరిగిన నాయకులు ఎవరూ కూడా అప్పట్లో. ఆయన వెంట నడవలేదు.. కానీ బాలచంద్రారెడ్డిఒక్కడే సంజీవయ్యకు అన్నీ తానే ముందుకు నడిపాడు.
సంజీవయ్య ఏమి చేయాలన్నా.. బాలచంద్రారెడ్డి సలహా తీసుకోకుండా. ముందుకు వెళ్లేవాడు కాదని అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగేది.
తర్వాత 2019లో రెండవసారి సంజీవయ్య 63,000 మెజారిటీతో గెలవడం. రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడంతో. సంజీవయ్యకు అధికారంతోపాటు. ఆయన ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందంటారు ఆయనతో సన్నిహితంగా ఉండేవారు.
మొదలైన వలసలు.
ఇక అప్పటివరకు తెలుగుదేశంలో కొనసాగిన. కొంతమంది నాయకులు. ఆ పార్టీ ఘోర పరాభవంతో.. వైఎస్ఆర్సిపి లోకి వలసపోయారు .
ఇక అక్కడి నుంచి మొదలైన. వర్గ పోరు. సంజీవయ్య పతనం వరకు కొనసాగింది.
సంజీవయ్య కొంతమందికే ప్రాధాన్యత ఇవ్వడం. కష్ట సమయాల్లో తోడుగా ఉన్న వారిని పక్కన పెట్టడం.
బాలచంద్రారెడ్డి లాంటి బలమైన నాయకుడికి తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం. పెళ్లకూరు మండలానికి చెందిన సత్యనారాయణ రెడ్డే. అసలైన నాయకుడు అన్నట్లు.
మిగిలిన వారు ఎవరు నాయకులు కాదన్నట్లు వ్యవహరించాడు సంజీవయ్య. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ముందు నుంచి ఉన్న వారి కన్నా. సంజీవయ్య వలస వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అనేది
జగమెరిగిన సత్యం.
తన స్థాయికి తగ్గ పదవి ఇవ్వలేదు.
ఇటు సూళ్లూరుపేట నియోజకవర్గం,దొరవారి సత్రం మండలం. అటు గూడూరు నియోజకవర్గం. చిట్టమూరు మండలంలో కూడా బాలచంద్రారెడ్డికి. సరైన పట్టు ఉంది. రెండు నియోజకవర్గాల ప్రజలకు ఆయన సుపరిచితుడు. ఆయనకంటూ ఒక వర్గాన్ని అలాగే. కొనసాగిస్తూ. వస్తున్నాడు.
రెండు నియోజకవర్గాల్లో ఆయనకంటూ భారీగానే ఓట్ బ్యాంకు ని ఏర్పాటు చేసుకున్నాడు బాలచంద్రారెడ్డి.
ఇంత పలుకుబడి ఉన్నాకూడా ఆయనకు.
కేవలం చెంగాలమ్మ ఆలయ చైర్మన్ గా మాత్రమే పదవిని కట్టబెట్టి. చేతులు దులుపుకున్నారు. ఇది కూడా ఆయనలోని అసంతృప్తికి ఒక
కారణమే. ఏది ఏమైనప్పటికీ.
పదవి ఏదైనా. పని ప్రధానంగా ముందుకు వెళ్లే స్వభావం ఉన్న బాలచంద్రారెడ్డి. చెంగాలమ్మ ఆలయ చైర్మన్ పదవికి కూడా. వన్నెతెచ్చాడు.
గతంలో లేని విధంగా ఎవరు. చెంగాలమ్మ ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు. ఆలయ అభివృద్ధికి.
తన సొంత నిధులను కూడా వెచ్చించి
ఎన్నో కార్యక్రమాలు చేశాడు.
ఆయనకి వైఎస్ఆర్సిపి పార్టీకి జిల్లాస్థాయి పరిశీలకుడుగానో. లేక నియోజకవర్గస్థాయి పరిశీలకుడిగానో.. సంజీవయ్య ఆయన పేరును ప్రతిపాదించి.ఎంపిక చేసి ఉంటే బాగుండేది అనేది ఆయన అభిమానుల వాదన.
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఒక పరిశీలికుడిని నియమించారు. ఒక్క సూళ్లూరుపేట నియోజకవర్గం. కొద్దిరోజులు మాత్రం ఎవరో ముక్కూ మొహం తెలియని వాడిని పరిశీలికుడుగా నియమించినా. ఇక్కడున్న. వర్గపోరుకి. నాయకుల మధ్య ఉన్న డామినేషన్ కి తట్టుకోలేక. స్వచ్ఛందంగా ఆయనే పక్కకు వెళ్లిపోయాడని అందరికి తెలిసిందే.
పైగా ఇక్కడ సంజీవయ్య నియంత పోకడలు. నేను ఉన్నన్ని రోజులు నేనే నియోజకవర్గానికి రాజులా వ్యవహరించాలి. అనే తత్వంతో ఇంకెవరిని ఎదగనివ్వకపోవడం. ఆయనలోని నియంత తాత్వానికి నిదర్శనం.
ఆయనొక్కడే నాయకుడా.
2022 తర్వాత.. నియోజకవర్గంలో. వైసీపీ లోరాజకీయ పరిస్థితులన్నీ మారిపోయాయి. కొత్త పోకడలు మొదలయ్యాయి.. పార్టీ కోసం కష్టపడ్డ వారిని మర్చిపోయి. వేడిని తట్టుకోలేక. కలుగులో నుండి బయటకు వచ్చిన యండ్రకాయలను పక్కన పెట్టుకొని తిరిగాడు సంజీవయ్య. వీటిల్లోఒక పెద్ద యండ్రకాయ.. అన్ని నేనేనంటూ. తనో చిన్న యండ్రకాయనని మర్చిపోయి. పెళ్లకూరు పులి, చిల్లకూరు సింహం అంటూ పేరు మార్చుకొని.. నియోజకవర్గ మొత్తం తన గుప్పెట్లో ఉండాలనే తపనతో. పెద్దమనిషినని మరిచిపోయి చిల్లర రాజకీయాలన్నీ చేశాడు. ఆధిపత్యం కోసం పోరాడాడు దానికి తగ్గట్లుగానే ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూడా. ఆయనే పెద్ద నాయకుడని భ్రమలో ఉంటూ.. బాలచంద్రారెడ్డి లాంటి. నియోజకవర్గంలో పట్టున్న నాయకులను చేజార్చుకున్నాడు అనేది జగమెరిగిన సత్యం.
అసలు సంజీవయ్యకు టికెట్ రాకుండా.. సంజీవయ్య మనకు వద్దు. మరొకరికి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గంలో పెద్దలందరిని రెచ్చగొట్టి. ఆఖరికి సంజీవయ్యకు ఈయనే పెద్ద దిక్కు అయిపోయాడని ఆ పార్టీ వర్గాల వాదన.
ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆ పెద్దమనిషికి బాలచంద్రారెడ్డికి గొడవలు స్థాయికి చేరినా . అప్పుడు కూడా బాలచంద్రారెడ్డి హుందా గానే వ్యవహరించాడుగానీ. ఎక్కడ కూడా చిల్లర రాజకీయాలు చేయలేదు.
ఇదొక్కటి చాలు ఆయనలోని హుందా రాజకీయానికినిదర్శని ఆయన వర్గీయులు చెప్తుంటారు..
ఇక నియోజకవర్గంలో ఈనొక్కడేనా నాయకుడు అంటూ. అందరిలోనూ వ్యతిరేకత మొదలైంది.. కొంతమంది బయటపడలేక లో లోపలే మదనపడ్డారు. కొంతమంది మాత్రం బహిరంగంగానే ఆయన మీద విమర్శలు చేస్తూ . కొన్ని సమయాలలో ఆయనపై తిరగబడి చేయి చేసుకునేదాకా సందర్భాలు కూడా వెళ్లాయి.
బాలచంద్రారెడ్డికి పార్టీపై అసంతృప్తికి సంజీవయ్య పై అసంతృప్తికి. ఇది కూడా ఒక కారణమే.
10 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డాము.
పార్టీ ఆదేశాలను శిరసా వహించి పని చేసుకుంటూ వెళ్ళాము.
అయినా తనకు తగిన గుర్తింపు లేదనేది.. ఆయనమనసులో బలంగా నాటుకుపోయింది.
అదే ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేసే వరకు వెల్లింది.
అయన పయనమెటు.
ఆయన వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేయడంతో. నియోజకవర్గంలోని ఆయన అభిమానుల పరిస్థితి కొంత సందిగ్ధంలో పడింది. బాలచంద్రారెడ్డి నిర్ణయం కోసం..అయన అభిమానులంతా ఆసక్తిగాఎదురుచూస్తున్నట్లు సమాచారం.
తెలుగుదేశం వైపు మొగ్గుచూపుతాడా..! లేక ఏదైన జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపుతాడు!! అనేది.. ఆయన వ్యక్తిగత నిర్ణయమే అయినా. అది ఆయన అనుచరులు,అభిమానుల భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందని. ఆయన నిర్ణయం ఏదైనా.. అది తొందరలో ప్రకటిస్తే అందరికీ మంచిదని. వారు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం కి. బాలచంద్రారెడ్డికి మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి.. గతంలో ఇద్దరు కలిసి ఒకే పార్టీలో పని చేశారు. కాబట్టి ఆయన తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతారని అభిమానుల్లో గట్టిగా వినపడుతున్న మాట.
కానీ వైసీపీ నాయకులను.. తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించవద్దు అంటూ చంద్రబాబునాయుడు.. ప్రకటించడంతో బాలచంద్రారెడ్డి నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన అభిమానులు.
Post a Comment