పొదలకూరు ఆస్పత్రిలో మరిన్ని వసతులు
డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు
ప్రజలను వైద్యాధికారులు సొంత కుటుంబ సభ్యులుగా భావించి సేవలందించాలి
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మొదట పొదలకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (ఆస్పత్రి)లోని అన్ని విభాగాలను పరిశీలించిన సోమిరెడ్డి..సమస్యలు, అవసరమైన సౌకర్యాలపై ఆరా
వైద్య రంగానికి సంబంధించిన అన్ని సమస్యలను మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ
మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్
ఐదారు మండలాలకు కూడలిగా ఉన్న పొదలకూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటరులో అందిస్తున్న సేవలు అభినందనీయం
ప్రతి నెలా వేలాది మంది ఇక్కడ వైద్యసేవలను సద్వినియోగం చేసుకుంటుండటం శుభపరిణామం
ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం
డయాలసిస్ సేవల కోసం ఈ ప్రాంత ప్రజలు వ్యయప్రయాసలకు ఓర్చి నెల్లూరుకు వెళుతున్న విషయం నా దృష్టికి వచ్చింది
పొదలకూరు ఆస్పత్రిలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడుతాం
మహ్మదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పనులకు పూర్తి చేసేందుకు అసరమైన చర్యలు తీసుకుంటా
నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతోనూ సమీక్ష నిర్వహించి అవసరాలను తెలుసుకుంటా
ప్రతి సమస్యపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో చర్చించి ఆస్పత్రుల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తా
ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి
జిల్లాలోని ప్రజా ప్రతినిధులందరం కలిసి అన్ని సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తాం
రాష్ట్రంలోని పరిస్థితులను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారు
Post a Comment