నెల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయ ఆధునీకరణకు చర్యలు
రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు, జూలై 3 : నెల్లూరు నగరం మూలాపేటలోని ప్రసిద్ధి ఆలయమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఆధునీకరించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావుకు సూచించారు. బుధవారం సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్‌కు మంత్రి పలు సూచనలు చేశారు. వేణుగోపాలస్వామి దేవాలయం నిధులు, ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా చేయాలని సూచించారు. అలాగే నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని తాను మంత్రి అయిన తరువాత తాను, మంత్రి నారాయణ కలిసి ఆలయాన్ని సందర్శించామని, ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందిన అద్దాల మండపం పునర్నిర్మాణం చేపట్టేందుకు, మండపంలోని చారిత్రాత్మక చిత్రాల రూపకల్పన మొదలైన పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు నగరంలోనే రంగనాథస్వామి ఎంతో విలువైన ఆస్తులు వున్నాయని, పూర్తిస్థాయిలో ఆస్తుల వినియోగం, ఆదాయంపై దృష్టిసారించాలన్నారు. జిల్లాలో చాలా ఆలయాలకు విలువైన ఆస్తులు, భూములు వున్నాయని, అయిననూ ధూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. వీటన్నింటిపై దృష్టిపెట్టనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, నెల్లూరు వారిచే జారీ
Post a Comment