నూతన ఇసుక విధానం అమలుకు జెండా ఊపిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా " నెలవల విజయశ్రీ

 నూతన ఇసుక విధానం అమలుకు జెండా ఊపిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా " నెలవల విజయశ్రీ




రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-


సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని దొరవారిసత్రం మండలం పరిధిలోని మావిళ్ళపాడు వద్ద ఉన్న ఇసుక స్టాక్ పాయింటును సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ  జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నూతన ఇసుక విధానం 2024 అమల్లోకి తీసుకువచ్చి నామ మాత్రపు రుసుముతో ప్రజలకు ఇసుక అందుబాటులోకి తేవడం జరిగిందని, ప్రజలు వారి గృహ నిర్మాణానికి, ప్రభుత్వ భవనాలు నిర్మాణానికి వంటి వాటికి మాత్రమే వినియోగించుకోవాలని, ఇతర రాష్ట్రాలకు ఎలాంటి అక్రమ రవాణాకు తావు లేకుండా ప్రజలు వాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు మరియు టీడీపీ నాయకులు మరియు గనుల శాఖ అధికారి మరియు ఆర్డిఓ చంద్రముని నియోజకవర్గం సబందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget