అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కార్యవర్గ సమావేశము నిర్వహించడం జరిగింది
ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్ర రెడ్డి జిల్లా అధ్యక్షులు నాగేంద్ర యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగి రెడ్డి పాల్గొనడం జరిగింది
ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టుడు యొక్క పిల్లలకు ఉచిత విద్య అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అది కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ఉచితంగా అందించాలని గత ప్రభుత్వం లో ఇది జర్నలిస్టులకు నోచుకోలేదని ఈ ప్రభుత్వంలో జర్నలిస్ట్ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆయన తెలియజేశారు సమస్యలు ఏవైనా కూడా తన దృష్టికి వచ్చింది వెంటనే పరిష్కారం దిశగా మేము ముందుకు వెళ్దామని జర్నలిస్ట్ పిల్లలు ఉచిత విధితోపాటు ఇంటి పట్టాలు మరియు హెల్త్ కార్డులు సమస్య ప్రస్తుతం రాష్ట్ర కమిటీ కూడా ఈ సమస్యల పైన పోరాటం చేస్తుందని తెలియజేశారు
జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ మునుపటిలో ప్రభుత్వంలో జర్నలిస్టుల పైన జరిగిన దాడులు ప్రతిఘటిస్తూ జిల్లా స్థాయి రాష్ట్రస్థాయిలో పలు ఉద్యమాలు నిర్మించిందని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ పోరాటం చేసినందుకు ప్రతిఫలంగా సమస్యలు పరిష్కారం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా జోగిరెడ్డి మరియు కడపల మల్లికార్జునరావు మన సమస్యల పైన ప్రసంగించారు మీటింగ్ కు జిల్లా కమిటీ లందరూ కూడా పాల్గొన్నారు,
Post a Comment