ఈరోజు సమాచారశాఖ మంత్రి కె. పార్థ సారధి గారిని కలసిన ఫౌండర్ ఛైర్మన్ లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారు
ఈరోజు సమాచారశాఖ మంత్రి కె. పార్థ సారధి గారిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలసిన ఫౌండర్ ఛైర్మన్ లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు రవితేజ, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డితో పాటుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు,కె రామచంద్రారెడ్డి కార్యదర్సులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్సులు మరియు మహిళా ప్రతినిధి లలిత నాయకులు కలసి జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది..
అన్నదాతలకు అవసరమైన వరి వంగడాలను సకాలంలో అందించాలి" ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ "
దొరవారి సత్రం, రవికిరణాలు
వ్యవసాయ రంగంలో రారాజులైన అన్నదాతలకు అవసరమైన వరి వంగడాలను సకాలంలో సబ్సిడీ విధానంలో వారికి అందేలా చూడాలని సులూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. గురువారం ఆమె మండల వ్యవసాయ అధికారుల ఏర్పాటుచేసిన పచ్చి రొట్ట ఎరువు విత్తనాలను రైతులకు సబ్సిడీలో పంపిణీ చేశారు. వ్యవసాయంలో అధిక దిగుబడులు వచ్చేందుకు, భూమి సారవంతంగా ఉండేందుకు ఉపయోగిస్తున్న పిల్లి పెసరు, జీలుగ, జనము విత్తనాలను తక్కువ ధరలకే సబ్సిడీ రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అన్నదాత దేశానికి వెన్నెముకని, రైతే రాజని అన్నారు. ప్రభుత్వపరంగా అన్నదాతలకు వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలను సకాలంలో చేరేలా చూడాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు గ్రామాలలో పర్యటించి, వారి భూములకు అనుపైన పంటలు వేసుకునేందుకు సూచనలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ వేమసాని శ్రీనివాసులు నాయుడు, మాజీ ఎంపీపీ ఇట్టికుంట రత్నయ్య, ఎంపీపీ దువ్వూరు సుజాతమ్మ, వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి వ్యవసాయ శాఖ ఏడి అనిత, ఏఓ లు జ్యోతిర్మయి, కవిత, కాంచన ఉద్యానవన శాఖ అధికారులు, సులూరుపేట తెలుగుదేశం నాయకులు సుధాకర్ రెడ్డి, దొరవారిసత్రం మండల నాయకులు యాగాని. ఆది ముని, కృష్ణమూర్తి, ఉదయ్ కుమార్, మురళి రెడ్డి, బాబు నాయుడు, కిషోర్ తెలుగు ప్రాజెక్టు సిబ్బంది, డిప్యూటీ తాసిల్దార్ గోపిరెడ్డి,
నేడు శ్రీ చెంగాళ్ళమ్మ హుడీ లెక్కింపు
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు పరాకామణి(హుండీ లెక్కింపు) తేది.27-06-2024 ఉదయం 09:00 గం’’లకు దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో పరాకామణి(హుండీ లెక్కింపు) కార్యక్రమము జరుగునని ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు తెలిపారు . ఆసక్తి గల భక్తులు పరాకామణి(హుండీ లెక్కింపు) కార్యక్రమములో డ్రెస్స్ కోడ్ (పంచే, బన్నియన్) పాటించుచూ పాల్గొనవలసినదిగా కోరారు.
విద్యార్థులకు విద్యాసామాగ్రి కిట్లు పంపిణీ.
సులూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించిన విద్యా కిట్లను సులూరుపేట శాసనసభ్యులు నెలవల డాక్టర్ విజయ శ్రీ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. గురువారం తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఎల్ఐసాగరం లోతువానిగుంట హైస్కూల్ వద్ద విద్యార్థులకు కిట్లు పంపిణీలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మాట్లాడుతూ విద్యార్థులు చదువు అనే ఆయుధంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆమె విద్యార్థులకు సూచించారు.అలాగే విద్యార్థులకు బ్యాగు,పుస్తకాలు,జామెంట్రీ బాక్సులు,షూ బట్టలు అందజేశారు. అనంతరం హైస్కూల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా చెట్లమొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎంఈఓ మునిరత్నం,పేట జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఉయ్యాల ప్రవీణ్,టిడిపి యువ నాయకులు నెలవల రాజేష్,గూడూరు సుధీర్ రెడ్డి,తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు అవధానం సుధీర్,మొండెం బాబు,వినుకొండ ధనంజయ,టిడిపి నాయకులు ఉపాధ్యాయులు గడదాసుల వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సఖి వన్ స్టాప్ సెంటర్ మరియు గృహ హింస చట్టం విభాగ కేంద్రాలను సందర్శించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డా. యోగేష్ దూబే
రవి కిరణాలు,తిరుపతి, జూన్ 25 : -
తిరుపతిలోని ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయబడిన సఖి వన్ స్టాప్ సెంటర్ మరియు గృహ హింస చట్టం విభాగం కేంద్రాలను మంగళవారం సందర్శించి పలు సూచనలు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డా. యోగేష్ దూబే.
సఖి వన్ స్టాప్ సెంటర్ మరియు గృహ హింస చట్టం విభాగం కేంద్రాల పని తీరు మరియు సిబ్బంది యొక్క వివరములు తెలుసు కోవడం జరిగినది. సదరు కేంద్రం నందు భాదితులకు అందుచున్న సేవలు మరియు వారి యొక్క వివరములు తెలుసుకోవటం జరిగినది. ప్రతి కేసు వారీగా బాధితులకు అందుచున్న సేవలు, వారి యొక్క అభిప్రాయాలూ తెలుసుకోవడం జరిగినది. కేంద్రం యొక్క పనితీరు మెరుగు పరచాలని సూచనలు చేయడం జరిగినది. సఖి వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగములు వీలు అయినంత త్వరగా భర్తీ చేయవలెనని ఆదేశించటం జరిగినది. తాత్కాలిక భవనము అయిన సఖి వన్ స్టాప్ సెంటర్ మరియు గృహ హింస చట్టం విభాగoలను వీలు అయినంత త్వరగా ప్రత్యేక భవనములోనికి మార్పు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమములో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని అయిన శ్రీమతి . ఎస్ జయలక్ష్మి , జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్. శేఖర్ , సఖి వన్ స్టాప్ సెంటర్ సెంటర్ అడ్మిన్ సుజాత , గృహ హింస చట్టం విభాగం కౌన్సిలర్ సుగుణ పాల్గొనడం జరిగినది.
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
సుళ్ళురుపేట నుండి పేర్నాడు కొరిడికి కి వెళ్లే బస్సుకు మంగళవారం తృటిలోపెను ప్రమాదం తప్పింది. ఉదయం అసలే బస్సు రద్దీగా ఉంది టీచర్స్, హాస్పిటల్స్ సిబ్బంది తొ ప్రయాణికులతో సూళ్లూరుపేట నుంచిబయలుదేరిన బస్సు పేర్నర్ రోడ్ లో ఒకసారి గా అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఊర్లకి వెళ్లాలంటే రోడ్లు సరిగా లేకపోవడంతో బస్సు అదుపు తప్పిందని ఉద్యోగస్తులు ప్రయాణికులు వాపోయారు. ఇకనైనా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు స్పందించి ఈ గ్రామానికి వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టి తారు రోడ్డు వేయాల్సిందిగా ఉద్యోగస్తులు ప్రయాణికులు కోరుతున్నారు.
కోటపోలూరు గ్రామంలో డయేరియా పై గ్రామస్తులకు అవగాహన సదస్సు.
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట పంచాయతీ పరిధిలోని వాటర్ పోలూరు 1వ గ్రామ పంచాయతీ నందు మంగళవారం డయేరియా అవేర్నెస్ అనే కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామపంచాయతీ లోని వివిధ గ్రామాలలో డయేరియా అవేర్నెస్ కల్పిస్తూ పరిసరాలను పరిశీలించి శానిటేషన్ చేయించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి, విస్తరణాధికారి, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ ఈ , ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఈ, మెడికల్ ఆఫీసర్, ఐసిడిఎస్ సూపర్వైజర్, సర్పంచి కమతం అరుణ కుమారి , ఎంపీటీసీ సత్యవతి శ్రీజ , ఇతర నాయకులు, సచివాలయం సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగనవాడి కార్యకర్తలు మరియు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు పాల్గొని డయేరియా అవేర్నెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మందు బాబులు తస్మా జాగ్రత్త.
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధం,నేరం.
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎస్సై కోటా రహీం రెడ్డి.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట పట్టణం తో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడా ఇక పై బహిరంగ ప్రదేశాలలో
మందుబాబులు మద్యం సేవించకూడదని ఎస్సై కోటా రహీమ్ రెడ్డి హెచ్చరించారు. పట్టణం లోని
పలు ప్రాంతాలలో మందు బాబులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడాన్ని గుర్తించి పలు చోట్ల హెచ్చరిక బోర్డులను (ప్లెక్సీ) ఏర్పాటు చేసి
అక్కడ పడి ఉన్న మద్యం సీసాలను శుభ్రం చేయించారు. ఇక పై ఎక్కడామద్యం సీసాలు ఉండకూడదని ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే తాట తీయడం జరుగుతుందని ఎస్సై కోటా రహీమ్ రెడ్డి హెచ్చరించారు. ఎస్సై తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
జగనన్న వెంట, పార్టీకి అండగా కార్యకర్తలకు తోడుగా వైసీపీ నాయకులు ఐక్యతరాగం
రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదాల అధ్యక్షతన కార్యకర్తల ఆత్మీయ సమావేశం
ఎవరు భయపడొద్దు, నష్టం వచ్చినా కష్టం వచ్చినా నేను ఆదుకుంటాను :- రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆదాల
ఇలాంటి సంస్కృతి నేనెప్పుడూ చూడలేదు :- మాజీ మంత్రి ఆదాల
కుటుంబ విలువలు తెలిసిన సంస్కారవంతుడిని - మరొక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయను :- రూరల్ వైసీపీ ఇన్చార్జి ఆదాల
ప్రజలకు మంచి చేయడం మాత్రమే నాకు తెలుసు నేను ఎవరికీ హాని చేయలేదు, ఆ విషయము అందరికీ తెలుసు :- మాజీ మంత్రి ఆదాల
సమావేశంకు హాజరైన అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాని, జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కోవూరు, నెల్లూరు సిటీ వైసీపీ ఇన్చార్జులు విక్రమ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, మహమ్మద్ ఖలీల్ అహ్మద్ తదితరులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో రూరల్ వైసీపీ కార్యాలయం
నెల్లూరు రూరల్ లో పార్టీ ఎక్కడ బలహీన పడలేదు చాలా పటిష్టంగా ఉంది అని చాటిచెప్పిన కార్యకర్తల సమావేశం
కార్యకర్తలకు భరోసా ఇచ్చానకు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ఆత్మీయ సమావేశం చేయడం హర్షణీయమన్న ముఖ్య నాయకులు కాకాని, పర్వతరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, మురళీధర్, రాజగోపాల్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, ఖలీల్ అహ్మద్ తదితరులు
ప్రతి కార్యకర్తకు, నాయకులకు, వైసీపీ సానుభూతిపరులకు, అభిమానులకు రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని జిల్లా నాయకత్వం గట్టి భరసా
కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్న జిల్లా వైసీపీ నాయకత్వం
కార్యకర్తలకు, నాయకులకు భరోసాగా, అండగా ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటామన్న జిల్లా వైసీపీ అధినాయకత్వం
జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక టీం, లీగల్ సెల్ ఏర్పాటు
కార్యకర్తలకు అండగా ప్రైవేటు కేసులు వేసేందుకు సిద్ధమన్న నేతలు
జిల్లా నాయకత్వం భరోసాపై వైసీపీ కార్యకర్తలు, నాయకులలో నూతనత్తేజం
కార్యకర్తలకు అండగా ఇందాకైనా సిద్ధమే :- మాజీ మంత్రి కాకాని
ప్రతి కార్యకర్త నాయకులకు జిల్లా పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది, ఎవరు భయపడవద్దు :- జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి
నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు, రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారి అధ్యక్షతన శనివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్, తాజా మాజీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి వైసీపీ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు నగర వైసీపీ ఇన్చార్జ్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి మాట్లాడిన నాయకులు అందరూ ఏకవచనంతో ఎవరు భయపడవద్దు, ఆందోళనపడవద్దు, రాష్ట్ర పార్టీ అధినాయకత్వం, జిల్లా పార్టీ నాయకత్వం అన్నివేళలా అందుబాటులో ఉండి అండగా ఉంటుందని సంయుక్తంగా సమిష్టిగా భరోసా కల్పించారు. తమ రాజకీయ జీవితంలో ప్రశాంతతకు స్నేహానికి మారుపేరైన నెల్లూరు జిల్లాలో ఇటువంటి హింసాత్మకమైన సంఘటనలు సంస్కృతి ఎన్నడూ చూడలేదని ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ వ్యాఖ్యానించారు. ఎన్నికలలో ఓటమి, విజయాలు అనేటివి సర్వసాధారణమని కానీ 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా తీర్పును మనస్ఫూర్తిగా గౌరవించిందని ఈ సందర్భంగా ముఖ్య నాయకులు తెలిపారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండి నేటి వరకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు వారి ఇష్టమొచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సానుభూతిపరులపై యద్దేచ్చగా దాడులుచేయడం ఆస్తు ధ్వంసం చేయడం భయాందోళనకు గురిచేయడం వంటి దుర్మార్గపు హింసాత్మకమైన సంఘటనలకు పాల్పడడం నీచమైన సంస్కృతి అని ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నేతలందరు ముక్తకంఠంతో ఖండించారు. ఏదేమైనా కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు, అన్ని విధాల అండగా ఉండేందుకు, ఎటువంటి కష్టం ఇబ్బంది వచ్చినా ఏ సమయంలో అయినా అందరం అందుబాటులోకి రావడం జరుగుతుందని నాయకులు భరోసా కల్పించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ మంత్రివర్యులు, రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఎవరికి ఎటువంటి చిన్న హాని కూడా తలపెట్టలేదని, కుటుంబ విలువల తెలిసిన వ్యక్తిని, మరొక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. ఎన్నికల అనంతరం కూడా దురుద్దేశంతో కావాలనే తన పైన బురదచల్లాలని కొందరిని వారివారి వ్యాపారాల పైన దెబ్బకొట్టి తనను తిట్టించే కార్యక్రమాలను చేపడుతున్నారని ఇటువంటి సంస్కృతి మంచిది కాదని రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు నియోజకవర్గంలోని ఏ కార్యకర్తకు నష్టం వచ్చిన, కష్టం వచ్చినా అన్నివిధాల ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కార్యకర్తలకు అన్నివేళల అందుబాటులో ఉంటానని మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలను ఆదుకునేందుకు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక లీగల్ సెల్ ను ఏర్పాటు చేసి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ప్రైవేటు కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నామని రూరల్ వైసిపి ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన వందలాది మంది కార్యకర్తలతో ఆదాల ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. ముఖ్య నాయకులు అందరు ఒకే వేదిక పైకి వచ్చి కార్యకర్తలకు అండగా ఉంటామని ఐక్యత రాగంతో ప్రకటించడంపై వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులలో నూతన ఉత్తేజం వెల్లువెరిసింది. ఈ సమావేశంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి, స్వర్ణ వెంకయ్య, పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, సిహెచ్ హరిబాబు యాదవ్, యేసు నాయుడు, బద్దిపూడి రవీంద్ర, పాశం శ్రీనివాస్, మల్లు సుధాకర్ రెడ్డి, లేబూరు పరమేశ్వర రెడ్డి, రావు శ్రీనివాస్ రావు, మల్లి నిర్మల, కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, మూలే విజయభాస్కర్ రెడ్డి, షేక్ ఫమీద, మండల పార్టీ అధ్యక్షులు పుచ్చలపల్లి రాంప్రసాద్ రెడ్డి, నాయకులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, పాలకీర్తి రవికుమార్, కల్లూరు లక్ష్మిరెడ్డి, షాలిని, అనితారెడ్డి, రజిని, వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆయా డివిజన్ల ఇన్చార్జులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సిపి అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చిల్లరగాళ్ల మాటవిని మీ రాజకీయపబ్బం గడుపుకోవడం ఆపండి.
మా పై నిందలు వేయడం ఆపండి. మా సహనాన్ని పరీక్షించవద్దు.
రాజకీయ లబ్దికోసం చిల్లరచేష్టలు చేయకండి. 29వ డివిజన్ టీడీపీ నేతలు.
కక్షపూరిత రాజకీయాలు వద్దు. శాంతియుతంగా రాజకీయాలు చేద్దామని గెలిచిన మొదటి రోజే చెప్పిన నాయకుడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
అధికారం ఉందని గత 16 నెలలుగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు అన్ని, ఇన్ని కాదు. 29వ డివిజన్ గాంధీనగర్ పార్క్ దగ్గర ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొని కొన్ని నెలలుగా ఆ యజమానికి అద్దె మరియు కరెంటు బిల్లు చెల్లించకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పి, విర్రవీగింది ఈ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు.
ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ లబ్దికోసం చిల్లరగాళ్ల మాటలు విని మీ రాజకీయపబ్బం గడుపుకోవడం ఆపండి.
అధికారం ఉందని గత 16 నెలలుగా అధికారమదంతో విర్రవీగింది మీ వెనుక తిరిగే అధికార వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు.
ఇదే 29వ డివిజన్ లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చీదరించుకొని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద అభిమానంతో, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఈ డివిజన్ ప్రజలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి 1000 మెజారిటీ ఇచ్చారు.
నెల్లూరు రూరల్ 28వ డివిజన్ చైతన్యపురి కాలనీ నేడు అధికారులతో రివ్యూ సమావేశం జరిగింది.
నెల్లూరు రూరల్ 28వ డివిజన్ చైతన్యపురి కాలనీ నేడు అధికారులతో రివ్యూ సమావేశం జరిగింది .ఈ సమావేశంలో స్థానికంగా ఉన్న శానిటేషన్ సమస్యల మీద అదేవిధంగా వాటర్, స్ట్రీట్ లైట్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, మరియు చైతన్యపురి కాలనీలో ఉండే పార్కులను సందర్శించడం, తరువాత మెయిన్ రోడ్ లో ఉండే కేశవ నగర్ వాటర్ ప్లాంట్ లో ఉండే సమస్య త్వరగా పరిష్కరించాలని 28వ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు చెక్కా సాయి సునీల్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డీఈ ప్రసాద్ గారు ,ఎలక్ట్రిసిటీ ఏ ఈ లక్ష్మీనారాయణ గారు ,అడ్మిన్లు కోటి, రమేష్, భాను, fitter అహ్మద్, కమల్ ,ప్లానింగ్ సెక్రటరీలు చంద్ర మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు
తాడేపల్లి
తాడేపల్లి సీతానగరం నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత
జేసీబీలతో పోలీసులు అధ్యర్యంలో కూల్చివేత..
గత ఆరు నెలలుగా జరుగుతున్న నిర్మాణాలు
ప్రభుత్వం స్థలంలో పార్టీ కార్యాలయాలు ఏంటని గతంలో పోరాటం చేసిన జనసేన టిడిపి.
సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా డాక్టర్ నెలవల విజయ శ్రీ ప్రమాణ స్వీకారం.
రవి కిరణాలు (అమరావతి):-
ఏపీ అసెంబ్లీలో తొలిసారిగామహిళా శాసన సభ్యురాలుగా డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రమాణ స్వీకారం చేశారు.
నెలవల విజయశ్రీ అనే నేను శానససభ సభ్యురాలు గా ఎన్నికైనందున శాననం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం,విధేయత చూపుతానని, భారతదేశసార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని,నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ నెలవల విజయశ్రీ ప్రమాణ స్వీకారం చేశారు.
బుచ్చిరెడ్డిపాలెంమున్సిపాలిటీలో10 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నాము
భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీనరేంద్ర మోడీ గారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని జూన్ 21వ తేదీని 10 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటించడం జరిగింది.
ఈరోజు 10వ యోగ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో గల శ్రీ పతాంజలి ధ్యాన యోగ ఆనంద నిలయంలో యోగా గురువు శ్రీ కల్లూరు బ్రహ్మయ్యగారు ( బిజెపి సీనియర్ నాయకులు) యోగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అధ్యక్షుడు రామిశెట్టి మోహన్ బాబు గారు, జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు గారు మరియు యోగ విద్యార్థులు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుడిగిన సందర్భంగా సంబరాలు.....
నెల్లూరు నగరంలోని స్థానిక ఆమని గార్డెన్స్ నందు జనసేన పార్టీ నాయకుడు నూనె మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అసెంబ్లీలో అడుగడిగిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి బాలసంచా పేల్చి, తదనంతరం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నందు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పండ్లు బ్రెడ్ తదితర వాటిని అందించారు ఈ సందర్భంగా మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు ఆకాంక్షించాలని, రాష్ట్రం సమగ్ర అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కారంపూడి కృష్ణారెడ్డి, గునుకుల కిషోర్, ఏటూరు రవి, శ్రీరామ్, జనసైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రధాని చొరవతో పురోగతిలోకి రాష్ట్రం
ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో, దూరదృష్టి, అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు మోడీతో సత్సంబంధాలు కలిగి ఉండడంతో రాష్ట్రం పురోగతివైపు పరుగులు తీయనిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్నాటి ఆంజనేయ రెడ్డి తెలిపారు శుక్రవారం నగరంలోని రామ్మూర్తి నగర్ లో ఉన్న బిజెపి జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆంజనేయ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానితో చంద్రబాబు నాయుడుకి ఆయనతోపాటుజనసేన పార్టీ అధ్యక్షుడు మంత్రి పవన్ కళ్యాణ్ లకు మంచి సంబంధాలు ఉన్నాయని, అలాగే విద్యావంతులైన విలువలతో కూడిన మంత్రులు ఉండడంతో తిరోగమనములో ఉన్న రాష్ట్రం పురోగతిలోకి వెళ్తుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదన్నాడుఅలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని తన సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇవ్వడం జరిగిందన్నారు గత ప్రభుత్వం జరిగిన అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు వీటన్నింటికీ పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారందరిని న్యాయస్థానంలో నిలబెట్టి లా చూడాలని చంద్రబాబు నాయుడుకి కర్నాటి విజ్ఞప్తి చేశాడు అలాంటి వారి విషయంలో ఉదాసీనతగా వ్యవహరించకూడదన్నారు రాష్ట్రంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదని గుర్తు చేశాడు రాష్ట్రంలో అసెంబ్లీలో జరిగే ప్రతి సభలో కూడా ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా కార్యకలాపాలు సాగించే విధంగా అసెంబ్లీలో కొనసాగాలన్నారుఅసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిలో లేకుండా బూతు పురాణాలకే పరిమితం అయిపోయిందని ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా సమావేశాలు కొనసాగాలని, గత వైసిపి పాలకులు లాగా అసెంబ్లీకి సంబంధంలేని మహిళలను కూడా దుర్భాషలాడడం జరిగిందని, అలాంటి చర్చలకు అవకాశం ఇవ్వకుండా ఈ నూతన టిడిపి ప్రభుత్వం వ్యవహరించాలన్నాడు రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరిపాలన సాగించాలన్నారు వైసిపి ప్రభుత్వం తాము చేసిన తప్పులను పట్టించుకోకపోగా, ప్రజలు తమకు ఓట్లు వేయలేదని తప్పుపడుతున్నారని ఆయన అన్నాడు, అలాగే ఈవిఎంలను కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకున్ననే తప్పు పట్టడం విచిత్రంగా ఉంది అన్నారు ప్రతిపక్ష పార్టీగా మీకు గుర్తింపు లేకపోయినా గెలిచిన అభ్యర్థులు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వం తప్పు చేస్తే, తప్పనిసరిగా ప్రశ్నించాల్సింది ప్రతిపక్షమేనన్నాడు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం కూడా ప్రతిపక్షంపై ఉందన్నాడు గతంలో తాము అధికారంలో లేమని ఒకసారి ప్రతిపక్ష నేతలందరూ అసెంబ్లీని బాయ్ కట్ చేశారని, ప్రతిపక్షం మరోసారి బాయ్ కట్ చేయకూడదు అన్నాడు రాష్ట్ర అభివృద్ధిలో నిర్మాణాత్మకమైన చర్చలు అసెంబ్లీలో కొనసాగాలని అలాగే అందులో వైసీపీ నేతలు కూడా భాగస్వాములు కావాలని ఆయన కోరారు ఇప్పటికే రాష్ట్రం రాజధాని లేక పోలవరం పూర్తికాక అనేక సమస్యలతో సతమతమవుతుందన్నారు రాజధాని అమరావతికి పోలవరం పూర్తయ్యేందుకు నరేంద్ర మోడీ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు కేంద్ర సహకారంతో అమరావతి రాజధాని వేగవంతంగా పూర్తి చేస్తే తద్వారా రాష్ట్ర ఖజానాకి ఆదాయం వస్తుందన్నాడు అలాగే రైతులకి ఇవ్వాల్సిన స్థలాలను తక్షణమే అందజేయాలన్నారు తద్వారా వ్యాపారాల లావాదేవీలు మొదలవడంతో పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందన్నారు ప్రస్తుతం ఈ జిల్లాలో కొత్త కొత్త రాజకీయాలకు తెర తీస్తున్నారు అన్నారు జిల్లాలో ఇసుక క్వాడ్జ్ మైనింగ్ సిలికా లాంటి వాటిని
దోచేసి ప్రశ్నించిన వాళ్లపై కేసులు నమోదు చేశారని వీళ్ళందరిని దృష్టిలో ఉంచుకొని ఫిరాయింపుదాలను పార్టీలో చేర్చుకోకుండా చూసుకొని దోచుకున్న వాళ్లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లాలోని శాసనసభ్యులను ఆయన కోరారు గతంలో వైసీపీ నేతలు బలవంతంగా వాలంటీర్లు చేత రాజీనామా చేయించారని, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాలంటీర్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉద్యోగమే పరమావధిగా పనిచేసిన వాలంటీర్లను తిరిగి ఉద్యోగాలలో కొనసాగించాలని తెలిపాడు ఈ జిల్లాలో ఎన్డీఏ కూటమి గెలుపుకు అహర్నిశలు కృషిచేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమము లో జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్, దాసరి రాజేంద్రప్రసాద్, గంజం పెంచల ప్రసాద్, ముక్కు రాధాకృష్ణ గౌడ్, లెక్కల రాజశేఖర్ రెడ్డి అవినాష్, తది తరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడవసారి సర్వేపల్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు.
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన నెల్లూరు పార్లమెంట్ తెదేపా అధికార ప్రతినిధి పఠాన్ సాబీర్ ఖాన్
గత ఐదేళ్లు కౌరవ సభగా మారిన శాసనసభ నేడు గౌరవ సభగా మారడం సంతోషంగా ఉంది...
వైకాపా ప్రభుత్వం చేసిన దాష్టికాలని ప్రజలు గమనించే నేడు వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా లేని తీర్పును ప్రజలు ఇచ్చారు...
గతంలో ఈ రాష్ట్ర స్థితిగతులను మార్చే చట్టాలు చెయ్యాల్సిన శాసనసభలో గత ముఖ్యమంత్రి మొదలు మంత్రులు వైకాపా శాసనసభ్యులు ఇష్టారీతిగా ప్రతిపక్షాలను దుర్భాషలాడుతూ కౌరవసభగా మార్చారు...
ఆనాటి దారుణాలను చూసి విసిగి వేసారిన నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భీష్మ ప్రతిజ్ఞ చేసి ఆనాటి కౌరవ సభను గౌరవ సభగా మార్చిన తరువాతే శాసనసభలో అడుగుపెడతానని తీసుకున్న నిర్ణయానికి నేడు సహకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు పాదాభివందనాలు...
ప్రతిపక్ష హోదా కూడా లేని వైకాపా ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులను తెలుసుకొని నడుచుకోవాలి....
గత 5 ఏళ్ళు వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయాన్ని చేసింది....
నేడు కూటమి ప్రభుత్వంలో శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను....
అదేవిధంగా వైకాపా క్రికెట్ టీం 11 మందికి నెల్లూరు పార్లమెంట్ కమిటీ తరుపున క్రికెట్ కిట్ ను బహుకరిస్తున్నాము...
వైకాపా 11 మంది శాసనసభ్యుల్లో ఏ ఒక్కరైనా వచ్చి ఈ కిట్ ను స్వీకరించాలి...
కెప్టెన్ గా ఎలాగో జగన్ రెడ్డి ఉంటాడు కనుక వైస్ కెప్టెన్ గా పెద్ది రెడ్డిని పెట్టుకుంటాడు ఏది ఏమైనప్పటికీ కనీసం ఆటల్లో ఉండే నీతినైనా వైకాపా నేర్చుకోవాలని తప్పుడు విధానాలను మార్చుకోవాలని అన్నారు...
కళ్ళు మూసి తెరిచే లోపు 5 ఏళ్ళు అయిపోతాయి అన్న జగన్ రెడ్డి అదే ఐదేళ్లలో తాను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని గుర్తించుకోవాలి....
ఈ ఐదేళ్లలో నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ సారధ్యంలో రాష్ట్ర రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి,పోలవరం నిర్మాణం, వ్యవస్థలకు పూర్వ వైభవం రావడాన్ని జగన్ రెడ్డి కళ్ళు ముసుకోకుండా చూడాలి....
నీతిని మరిచిన జగన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఇక కనీసం పులివెందుల నియోజకవర్గ శాసనసభ్యుడిగా నైనా జగన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి న్యాయం చేయాలి...
అదేవిధంగా నేడు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నెల్లూరు రురల్ ప్రజల అపద్భాంధవుడు ప్రజా నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పఠాన్ సాబీర్ ఖాన్ గారు తెలిపారు
పై సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి కనపర్తి.గంగాధర్,మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి అస్లాం 36 వ డివిజన్ ఇంచార్జి ఎస్ ఎ రసూల్ మైనారిటీ సెల్ కార్యదర్శి సత్తార్,అఫ్జల్
సులేమాన్ తదితరులు పాల్గొన్నారు
యోగతోనే శారీరక, మానసిక ఆరోగ్యం
• యువత తమ జీవితంలో యోగను భాగం చేసుకోవాలి
• ఘనంగా 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవం
• ఆకట్టుకున్న ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల యోగ ప్రదర్శన
• భారతదేశం ఆకారంలో విద్యార్థుల మానవహారం
నెల్లూరు, 21 జూన్ 2024
యోగతోనే శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమౌతుందని, ఈ నేపథ్యంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువతరం యోగను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని, రోజుకు కనీసం ఓ గంట యోగ సాధన కొనసాగించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగ మిత్రమండలి - నెల్లూరు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, క్షేత్ర కార్యాలయం - నెల్లూరు, నెహ్రూ యువకేంద్ర, పి.ఎం.పి. అసోసియేషన్, రుడ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరు డి.కె.జూనియర్ కళాశాల వసతిగృహంలో యోగ సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమ అనంతరం యోగ గురించి అన్ని రంగాల ప్రజలకు అవగాహన కల్పించే సంకల్పంతో సెంట్రల్ బ్యూర్ ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్ర కార్యాలయం, నెల్లూరు మరియు ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ - నెల్లూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. దాదాపు 10 రోజుల పాటు ఇథాకా ఇంటర్నేషనల్ స్కూల్ జి.ఎం. శ్రీ సంగం జీవన్, ప్రిన్సిపల్ శ్రీ రవికుమ్మమూరు, యోగ శిక్షకురాలు శ్రీమతి పద్మావతి పర్యవేక్షణలో కఠోర పరిశ్రమ ద్వారా విద్యార్థుల యోగాసనాలతో చేసిన అద్భుతాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భారతదేశ రూపులో విద్యార్థులతో ఏర్పాటు చేసిన మానవ హారం విశేషంగా ఆకట్టుకుంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సాధారణ ప్రజలు యోగ వైపు ఆకర్షితులు అవుతారని భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దొడ్ల కౌసల్యమ్మ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ఎ.శ్రీనివాసులు గారు మాట్లాడుతూ... నిత్యం యోగ సాధన ద్వారా అనేక రుగ్మతలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి, జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు యోగ ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
గీతా వైభవ్ ట్రస్ట్ కు చెందిన బాషా గురూజీ మాట్లాడుతూ... భారతీయ సనాతన ధర్మం యోగకు ఎంతో ప్రాధాన్యతనిచ్చిందని, గత 10 సంవత్సరాలుగా ప్రపంచం ఈ స్ఫూర్తిని గుర్తించిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం ద్వారా చక్కని ప్రయోజనాలు పొందాలని సూచించారు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగే వారికి యోగ చక్కని సాధనమని అభిప్రాయ పడ్డారు.
ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార సహాయకులు శ్రీ హరికృష్ణ, యోగమిత్ర మండలి సభ్యులు శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, శ్రీ రవీంద్ర, యోగ శిక్షకులు శ్రీమతి పద్మావతి, శ్రీ నాగూర్ గురూజీ, పి.హెచ్.పి. జిల్లా అధ్యక్షులు శ్రీ శాఖవరపు వేణుగోపాల్, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ రసూల్, న్యాయవాది శ్రీమతి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.