వైఎస్సార్ సీపీ లోకి భారీ వలసలు
టీడీపీ లో నుంచి భారీ అనుచరులు తో వైఎస్సార్ సీపీ లో చేరిన తుమ్మలపల్లి మధుసూదన్ రావు దంపతులు
తుమ్మలపల్లి మధు దంపతులను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు
రాపూరు: ఎన్నికలు సమీపిస్తున్న వేళా వైఎస్సార్ సీపీ లో జోష్ జోరందుకుంది నెల్లూరు జిల్లా రాపూరు లో టీడీపీ కి భారీ షాక్ తగిలింది.. రాపూరు మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీదేవి భర్త తుమ్మలపల్లి మధుసూదన్ రావు 1500 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ సీపీ లో చేరారు..పార్టీలో చేరిన వారికి వైఎస్సార్ సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ది గౌరవ శ్రీ నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు వెంకటగిరి బీసీ నేత బొలిగర్ల మస్తాన్ యాదవ్ గారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ పాపకన్ను మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో పండుగ వాతావరణం తలపించేలా చేరికలు జరిగాయి..పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు తెలిపారు.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు..
రాపూరు లో టీడీపీ కనుమరుగు
రాపూరు మండలంలోని దాదాపు టీడీపీ కనుమరుగైందని వైఎస్సార్ సీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్ది నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు తెలిపారు.. ఇప్పటి వరకు రాపూరు మండలంలో 8 వేలు మెజారిటీ వస్తుందని అంచనా వేయడంతో ఈరోజు మధుసూదన్ రావు చేరడంతో ఆ సంఖ్య 10 వేలు పై చిలుక చేరిందన్నారు..అధికారంలోకి వచ్చిన రాపూరు ని అన్నివిధాలా అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్తామన్నారు..పట్టణాన్ని తలదన్నేలా రాపూరును అభివృద్ధి చేస్తామన్నారు..ఈ కార్యక్రమంలో జేసిఎస్ మండల ఇంచార్జి దందోలు నారాయణ రెడ్డి, రాపూరు మాజీ సర్పంచ్ పిట్టబోయిన వెంకటసుబ్బయ్య యాదవ్,వైస్ ఎంపీపీ పెంచల్ రెడ్డి,నారీబోయిన శ్రీనివాసరావు,పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment