ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు అనుసరించాలి
రానున్న సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధంగా ఏర్పాట్లు చేపడుతున్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా జి. లక్ష్మీ శ
రవి కిరణాలు,తిరుపతి, మార్చి18 : -
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధంగా ఏర్పాట్లు చేపడుతున్నామని భారత ఎన్నికల కమిషన్ మార్చి16 న శనివారం మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని, మన రాష్ట్రంలో నాలుగవ దశలో ఎన్నికలు జరగనున్నాయి అని, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు నడుచుకోవాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా జి. లక్ష్మీ శ తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరం నందు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి ఆధ్వర్యంలో ఎన్నికల సన్నద్ధత పైగుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధంగా ఏర్పాట్లు చేపడుతున్నామని భారత ఎన్నికల కమిషన్ మార్చి16 న శనివారం మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని, మన రాష్ట్రంలో నాలుగవ దశలో ఎన్నికలు జరగనున్నాయని, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు నడుచుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతులు సువిధ యాప్ నందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ఏదేని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అంశాలను గుర్తిస్తే వాటిని సి - విజిల్ యాప్ నందు ఫోటో, టెక్స్ట్, వాయిస్, వీడియో రూపంలో పంపవచ్చని వాటిపై 100 నిమిషాల్లోపు పరిష్కారం చూపించడం జరుగుతుందని తెలిపారు. సాక్షం యాప్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈఆర్ఓ లు వారి పరిధిలో ఎంసిసి టీమ్ లు పక్కాగా పనిచేసేలా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, ఉల్లంఘనలు ఉండరాదని సూచించారు. స్టార్ క్యాంపెయినర్, వివిధ రాజకీయ పార్టీలు, ఎన్నికల అభ్యర్థి వారి పర్యటనలో ఎన్నికల ప్రవర్తనా నియమావళినిఅనుసరించాల్సి ఉంటుందని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కలెక్టర్ గారి సూచనల మేరకు డిఆర్ఓ పెంచల కిషోర్ గారు వివరిస్తూ 2023 ఏప్రిల్ 15 నుండి 17 మార్చి24 నాటికి 6,7 & 8 పార్మ్స్ 9244 పెండింగ్ ఉన్నాయని తెలిపారు. అందులో ఫారం 6 కు సంబంధించి 4476, ఫారం 6 ఏ - 5, ఫారం 7 - 2475, ఫారం 8- 2288 పెండింగ్ లో ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో ఈఆర్ఓ లు ధ్యానచంద్ర, అదితి సింగ్, కోదండ రామిరెడ్డి, చంద్రముని, నిషాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, రవిశంకర్ రెడ్డి, రాంమోహన్ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment