రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలి : డి ఆర్ ఓ

 రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలి  :  డి ఆర్ ఓ 

రవి కిరణాలు,

తిరుపతి, మార్చి 4 :-



 రానున్న  సార్వత్రిక ఎన్నికలు -  2024 నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని  డి ఆర్ ఓ  పెంచల్ కిషోర్  పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం  నందు  సార్వత్రిక  ఎన్నికలు-  2024 విధులను కేటాయించిన  నోడల్ ఆఫీసర్ లకు ఎన్నికలలో నిర్వహించవలసిన విధుల పై  సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా  డి ఆర్ ఓ మాట్లాడుతూ..  రానున్న ఎన్నికల  నిర్వహణలో నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన నిధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులకు కావలసిన సిబ్బందిని కేటాయించేలా, ఏర్పాట్లు మ్యాన్ పవర్, ట్రైనింగ్,  మెటీరియల్,  ట్రాన్స్ పోర్ట్,   సైబర్ సెక్యూరిటీ,  స్వీప్,  లా అండ్ ఆర్డర్,  ఈ వి ఎం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్,  ఎక్ష్పెండిచర్,  బ్యాలెట్ పేపర్స్,  పోస్టల్ బ్యాలెట్,  మీడియా, కమ్యూనికేషన్ ప్లాన్,  ఎలెక్టోరల్ రోల్స్,  ఓటరు హెల్ప్ లైన్, అబ్జర్వర్స్ తదితర విభాగాలలో నోడల్ ఆఫీసర్లుగా కేటాయించిన అధికారులందరూ విధులను ఎప్పటికప్పుడు సమన్వయం  చేసుకొంటు ఎన్నికల విధుల నిర్వహణకు  ఎలాంటి కొరత లేకుండా సిబ్బందిని సంసిద్ధం చేసుకోవలన్నారు. 

ఈ సమావేశంలో ఎన్నికల విధులు కేటాయించిన వివిధ నోడల్ ఆఫీసర్లు, ఎలక్షన్ సూపెరింటెండెంట్ చంద్రశేఖర్, డి.టి గంగయ్య  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget