అందరితో కలిసిమెలిసి పని చేస్తానని.. జిల్లా అధ్యక్ష స్థానాన్ని పదవిలా కాకుండా బాధ్యతగా నిర్వహిస్తానని తెలిపారు






(16-03-2024) ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన మండల పార్టీ కన్వీనర్లు, మండల JCS ఇన్చార్జులు, అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జులతో ముఖమైన సమావేశం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేణుంబాక విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 
 ఈ సమావేశం నిర్వహించడానికి ముందు శ్రీ విజయసాయి రెడ్డి గారు,  జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు, మరియు ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన తూర్పు రాయలసీమ శాసనమండలి సభ్యులు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని అనుకోని సందర్బంగా ఈరోజు బాగుంది అని శ్రీ విజయసాయి రెడ్డి గారు జిల్లా అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది.
 ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ
ఈరోజు అనుకోకుండా జిల్లా అధ్యక్ష స్థానంలో కూర్చోవడం జరిగింది. రాబోయే రోజుల్లో  గౌరవ పెద్దలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, స్థానిక నాయకులతో చర్చించి పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపడతానని తెలియజేశారు. 
 అందరితో కలిసిమెలిసి పని చేస్తానని.. జిల్లా అధ్యక్ష స్థానాన్ని పదవిలా కాకుండా బాధ్యతగా నిర్వహిస్తానని తెలిపారు. 
 గౌరవ పార్టీ జాతీయ అధ్యక్షులు  మరియు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరియు పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల ప్రకారం జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా  కేంద్ర కార్యాలయానికి, జిల్లాస్థాయి, మండల స్థాయి  నాయకులకు మధ్య వారధిగా ఉండి స్థానిక నాయకులకు కార్యకర్తలకు సహాయ సహకారాలు అందిస్తూ పనిచేస్తానని తెలిపారు
 త్వరలో జిల్లా మంత్రులు శాసనసభ్యులు, మండల స్థాయి నాయకులను కలుస్తానని తెలియజేశారు.
 ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో  శ్రీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయవంతం కావాలని, జిల్లాలో పార్టీని ఏకతాటిపై నడిపి  నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంతో కలిపి 8/8 స్థానాలను, నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని  అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో భాగస్వామ్యం అవ్వాలని ఆకాంక్షించారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget