చెంగాళ్ళమ్మ హుండీ ఆదాయం రూ. 49,76,626/-
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
కాలంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు తమిళ ఆరాధ్య దైవం
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి హుండీలు గురువారం తెరిచి లెక్కించుట జరిగినది. 3 నెలలు 8 రోజులకు గాను రూ"49,76,626/-లు నగదు, విదేశీ కరెన్సీ:- USA డాలర్స్-78, UAE దిరహమ్స్-10, మలేషియా-2 రింగ్గిట్, కెనడా డాలర్స్-5, ఇండోనేషియా-55000 రూపాయి మరియు బంగారం:-70 గ్రాములు, వెండి:-183 గ్రాములు మరియు అన్నదానం రూ.55,891/-లు ఆదాయం చేకూరినది. ఈ కార్యక్రమములో ఛైర్మన్, దువ్వూరు బాల చంద్రా రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాళ్ల చంద్రశేఖర్ రెడ్డి, శ్రీమతి మన్నెముద్దు పద్మజ, కర్లపూడి సురేష్ బాబు, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు ముంగుర అమరావతి, దేవస్థానము సిబ్బంది, మెప్మా సభ్యులు, విశ్రాంతి బ్యాంకు ఉద్యోగులు, దేవాదాయ శాఖ, ఇన్స్పెక్టర్ సి హెచ్. శ్రీనివాస బాబు గారి పర్యవేక్షణలో, సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు సమక్షంలో లెక్కింపు పూర్తి చేయుట జరిగినది.
Post a Comment