వై.ఎస్.ఆర్. ఇ.బి.సి. నేస్తం మూడవ విడత జిల్లాలోని మహిళలకు రూ.26.14 కోట్లు లబ్ది : జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
రవి కిరణాలు*తిరుపతి, మార్చి 14:
మహిళా సాధికారత కోసం పేద మహిళలకు అండగా చిన్న చిన్న వ్యాపారాలను అభివృద్ది చేసుకోవాలనేలా ఆర్థికంగా ఎదగాలని వైఎస్ఆర్ ఇబిసి నేస్తం మూడవ విడతగా జిల్లాలో 17,428 మందికి రూ.26.14 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నేడు గౌ. ముఖ్యమంత్రి జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీ శ అన్నారు.
గురువారం ఉదయం గౌ.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లా, బనగానపల్లె నుండి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 4,19,583 మంది లబ్దిదారుల ఖాతాలకు వై.ఎస్.ఆర్. ఇ.బి.సి. నేస్తం నగదు జమ చేసే కార్యక్రమాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించగా , స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలకు 45 - 60 సం. మధ్య వయసు కలిగి ఉండి ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నత వర్గాలకు చెందిన కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, ఓసి వంటి సామాజిక వర్గాల్లో పేద మహిళలైన వారికి ప్రతి సంవత్సరం 15 వేల రూపాయల నగదుని వారి ఖాతాలో జమ చేసే కార్యక్రమంలో భాగంగా నేడు తిరుపతి జిల్లాలో మూడవ విడత 17,428 మంది కి 26.14 కోట్లు నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ అయ్యిందని తెలిపారు.
మూడవ విడత లబ్ధి పొందిన వారి వివరాలు:
నియోజకవర్గాల వారిగా చంద్రగిరి లబ్దిదారులు – 5464, జమ రూ.8.20 కోట్లు, గూడూరు లబ్దిదారులు -1699, జమ రూ.2.55 కోట్లు, నగిరి (పుత్తూరు, వడమాలపేట) లబ్దిదారులు -2212, జమ రూ.3.32 కోట్లు, సూళ్ళురుపేట - లబ్దిదారులు 1763, జమ రూ.2.64 కోట్లు, సత్యవేడు లబ్దిదారులు 1668, జమ రూ.2.50 కోట్లు, శ్రీకాళహస్తి లబ్దిదారులు 2304, జమ రూ.3.46 కోట్లు, తిరుపతి లబ్దిదారులు- 1793, జమ రూ.2.69 కోట్లు, వెంకటగిరి(పార్ట్ ) లబ్దిదారులు -525, జమ రూ.0.79 కోట్లు వెరసి మొత్తం కలిపి రూ.26.14 కోట్లు మెగా చెక్కును విసి అనంతరం లబ్దిదారులకు మెగా చెక్ ను కలెక్టర్ పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో ఎఈఓ, బిసి కార్పోరేషన్ బాబు రెడ్డి, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, సహాయ బిసి సంక్షేమ అధికారులు చంద్ర శేఖర్ తదితర అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.
Post a Comment