2024 సాధారణ ఎన్నికల షెడ్యూలు విడుదల నేపథ్యంలో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్.

 2024 సాధారణ ఎన్నికల షెడ్యూలు విడుదల నేపథ్యంలో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్.

 18-19 సంవత్సరాల వయస్సు ఉండి కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 36162 

విలేకరుల సమావేశం లో.. కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ..

ప్రశాంత వాతావరణంలో హింసకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణకు చర్యలు: జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్

రవి కిరణాలు,తిరుపతి, మార్చి18 :-



 కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల  షెడ్యూల్ మేరకు సార్వత్రిక ఎన్నికలు 2024 ను జిల్లా లో ప్రశాంత వాతావరణం  లో ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా కలదని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి.లక్ష్మీ శ పేర్కొన్నారు.

కేంద్ర ఎన్నికల కమీషన్ సాధారణ ఎన్నికలు - 2024 షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో సోమవారం జిల్లా  సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా  ఎన్నికల అధికారి ,జిల్లా ఎస్ పి  కృష్ణ కాంత్ పటేల్, జిల్లా జాయింట్ కలెక్టర్  హెచ్.ఎం ధ్యానచంద్ర లతో కలసి ఎన్నికల సన్నద్ధత, నిర్వహణ కు సంబంధించి జిల్లాలో చేపడుతున్న కార్యాచరణ పై వివరాలను వెల్లడించారు. 

ఎన్నికల నోటిఫికేషన్ తేది : 18-04-2024

నామినేషన్ల స్వీకరణ కు చివరి తేది : 25-04-2024

నామినేషన్ల పరిశీలన : 26-04-2024

నామినేషన్ల ఉపసంహరణ : 29-04-2024

పోలింగ్ తేది : 13-05-2024

కౌంటింగ్ తేది : 04-06-2024

జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన వివరాలు :

అసెంబ్లీ నియోజకవర్గాలు : 7

పార్లమెంటరీ నియోజకవర్గం: 1

జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య : 17,94,733 

పురుషులు : 8,74,738

స్త్రీలు : 9,19,817

థర్డ్ జెండర్ : 178

 18-19 సంవత్సరాల వయస్సు ఉండి కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 36162  పురుషులు : 19761 ,స్త్రీలు :16398

 వికలాంగులు (PWD) ఓటర్లు: 24,481 పురుషులు : 13,867 స్త్రీలు :10,614

        థర్డ్ జెండర్ : 0

 85 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల ఓటర్లు: 7940.

 పురుషులు : 3386

         స్త్రీలు : 4551

NRI ఓటర్లు మొత్తం:287

పురుషులు :233

         స్త్రీలు :54

సర్వీస్ ఓటర్లు మొత్తం: 867

పోలింగ్ స్టేషన్ల వివరాలు..:

మొత్తం పోలింగ్ స్టేషన్లు : 2136 (2130+6 అనుబంధ పోలింగ్ కేంద్రాలు)

అర్బన్ 534, రూరల్ 1596

మొత్తం పోలింగ్ స్టేషన్ లోకేషన్ల సంఖ్య : 1395 (అర్బన్ 235,రూరల్ 1160)

సమస్యాత్మక (క్రిటికల్) పోలింగ్ స్టేషన్ల సంఖ్య : 660

EVM ల వివరాలు..:

కంట్రోల్ యూనిట్లు (CUలు): 

5149

బ్యాలెట్ యూనిట్లు (BUలు): 6458

VVPATS:6291

అన్ని పోలింగ్ స్టేషన్ల లలో విద్యుత్, ర్యాంప్, మంచి నీటి సౌకర్యం కల్పించడం జరుగుతోంది.

ఎన్నికల  సంబంధిత టీమ్స్:

Mcc (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)- 44

స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (SST) : 70 

ఫ్లయింగ్ స్క్వాడ్స్ (FST): 82 

వీడియో నిఘా బృందాలు (VSTలు): 31

వీడియో వీక్షణ బృందాలు (VVTలు): 8

వాలంటీర్లకు ఎన్నికల విధులు లేవు

ముఖ్యంగా.. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి విధులను కూడా సచివాలయ పరిధిలోని వాలంటీర్లను అప్పజెప్పడం లేదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

ముఖ్యమైన IT అప్లికేషన్లు:

1). నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్: (NGSP) ప్రజలకు మరియు రాజకీయ పార్టీలకు ఎన్నికల పిర్యాదులు మరియు ప్రశ్నలను దాఖలు చేయడానికి ఉపయోగించే పోర్టల్.

2). సి-విజిల్ యాప్: (C VIGIL) మోడల్ ప్రవర్తనా నియమావళి, వ్యయ ఉల్లంఘనలు మరియు ఇతర ఏవైనా ఉల్లంఘనలను నివేదించడానికి పౌరులను అనుమతిస్తుంది.

3). సువిధ యాప్: (SUVIDHA ) అభ్యర్ధులు మరియు రాజకీయ పార్టీలు ర్యాలీలు, సమావేశాలు మరియు ఇతర ప్రచార-సంబంధిత కార్యకలాపాలకు అనుమతులను అభ్యర్ధించడానికి ప్రక్రియను సులభతరం చేస్తుంది.

4). ఓటర్ హెల్ప్ లైన్ యాప్: (VOTER HELP LINE) ఓటర్లకు వారి నమోదు స్థితి, పోలింగ్ స్టేషన్ వివరాలపై సమాచారాన్ని అందిస్తుంది మరియు రిజిస్ట్రేషన్లు మరియు కరెక్షన్స్ కోసం ఆన్లైన్ పారమ్లను సమర్పించడానికి ఉపయోగపడుతుంది.

5). KYC యాప్: పోటీలో ఉన్న అభ్యర్ధుల గురించి సవివరమైన సమాచారాన్ని పొందేందుకు ఉపయోగపడుతుంది.

6) సక్షం యాప్ (SAKSHAM): పీడబ్ల్యూడి ఓటర్లకు సక్షమ్ యాప్ ఉన్నాయని తెలిపారు.

ఎన్నికల నియమావళి...

షెడ్యూలు ప్రకటించిన తేదీ నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అన్ని రాజకీయ పార్టీలు, పోటీలోనున్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించరాదు. సభలు, సమావేశాలు, వాహనాలకు అన్ని ముందస్తు అనుమతి పొందాలి.

సమాచారము మరియు ఫిర్యాదుల మాధ్యమాలు :

పోర్టల్: నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ (NGSP)

యాప్ : సీ-విజిల్ యాప్ (C VIGIL) నందు టెక్స్ట్, వాయిస్ , వీడియో, ఫోటో రూపంలో ఫిర్యాదు చేయవచ్చని 100 నిమిషాల లోపు పరిష్కారం చూపబడుతుందని తెలిపారు.

ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ : 1950 (టోల్ ఫ్రీ)

స్వీప్ కార్యక్రమాల నిర్వహణకు అందరూ సహకరించి ఓటరు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మీడియా ప్రతినిధులు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వారి సహకారాన్ని అందచేయాలని కోరారు.

శాంతి భద్రతలు (లా & ఆర్డర్) :ఎస్.పి

జిల్లాలో ప్రశాంత వాతావరణం లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  ఎన్నికలను నిర్వహించడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే 82 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పని చేస్తున్నాయని, జిల్లాలో 3 కంపెనీల కేంద్ర బలగాలు చేరుకున్నాయని, సమస్యాత్మక పోలింగ్ కేంద్ర పరిధిలోని మండలాలలో కవాతు నిర్వహించడం జరుగుతోందని, గతంలో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడిన వారిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, వెపన్స్ అన్నింటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందనీ తెలిపారు. మన తిరుపతి జిల్లా వరకు సంబంధించి 6.5 కోట్లు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. మన జిల్లాకు 4000 మంది పోలీస్ సిబ్బంది అవసరముంది అని నేటికీ మన జిల్లాలో 2700 మంది ఇప్పటికే అందుబాటులో ఉన్నారని తెలిపారు. 7 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 15 అంతర్  జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి డిఎస్పీ స్థాయి అధికారులు పరిశీలన జరిగిందన్నారు. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం సిద్దం ..

అనంతరం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెల్ ను కలెక్టర్ గారు జెసి గారితో కలిసి పరిశీలించారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget