శ్రీ చెంగాళ్ళమ్మ ఆలయంలో ఘనంగా ప్రాకారోత్సవం, క్షీరాభిషేకం.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఫిబ్రవరి 24:-
సూళ్లూరుపేట పట్టణంలో కాలంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు తమిళ ఆరాధ్య దైవం భక్తుల కొంగుబంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి దక్షిణముఖ కాళీ శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం లో శనివారం ప్రాకారోత్సవమును అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి 108 క్షీర కలశాలతో అమ్మవారి వద్ద ప్రతిష్టించి పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్ఛారణాలతో, మంగళ వాయిద్యాలతో అష్టోత్తర 108 క్షీర కలశములను ప్రాకారోత్సవము చేసి అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించి అనంతరం మహా చండీయాగం నిర్వహించారు. ఈ చండియాగానికి ఉభయకర్తలుగా సూళ్లూరుపేటకు చెందిన చెరుకుపల్లి రామ్ కుమార్ శ్రీ లక్ష్మీ దంపతులు వ్యవహరించారు. అమ్మవారికి యూఎస్ఏ కి చెందిన ఉదయ్ శంకర్ రెడ్డి శ్రీమతి సింధూర దంపతులు వెండి కలశం-1 (1 కేజీ 40 గ్రాములు) , నెల్లూరు కి చెందిన వి . రాజేశ్వరప్రసాద్ వెండి తీర్థపు గిన్నెలు-2 (129 గ్రాములు) మరియు దేవస్థానము నందు జరుగు నిత్య అన్నదానమునకు ఒంగోలుకు చెందిన యెక్కల గురు రత్న సాయికుమార్ కుటుంబ సభ్యులు రూ .41116/- రూపాయలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు ముప్పాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి, ఓలేటి బాల సత్యనారాయణ, కర్లపూడి సురేష్ ,బండి సునీత, పెను భేటీ మారెమ్మ ,మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు ముంగర అమరావతి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment